అప్పుడు నిహారిక ..ఇప్పుడు ఉపాసన .. రామ్ చరణ్ గురించి ఆ విషయాన్ని ఒకే విధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారుగా..!

రామ్ చరణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో త్వరలోనే గేమ్ ఛేంజర్.. సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ ని.. తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..ప్రెసెంట్ తన బాబాయ్.. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు . ఈ క్రమంలోని రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది . ఈ వేడుక కోసం .. ఢిల్లీకి కూడా రామ్ చరణ్ తన భార్యతో వెళ్లి సందడి చేశారు. కాగా ఇదే మూమెంట్లో సోషల్ మీడియాలో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న పిక్చర్ కు రామ్ చరణ్ కామెంట్ పెట్టాడు. అయితే దీనికి ఉపాసన షాపింగ్ రియాక్షన్ ఇచ్చింది . సోషల్ మీడియాలో నువ్వు కూడా యాక్టివ్ గా ఉంటావా ..అన్న రేంజ్ లో షాకింగ్ ఎమోజీస్ తో కామెంట్స్ చేసింది .

సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అయితే గతంలో నిహారిక సైతం .. రామ్ చరణ్ పై ఇదేవిధంగా కామెంట్స్ చేసింది . మెగా హీరోలు అందరిలో రామ్ చరణ్ సోషల్ మీడియాను తక్కువగా వాడుతారు అని గ్రూప్లో అస్సలు యాక్టివ్ గా ఉండరు అని చెప్పుకు వచ్చింది . ఇప్పుడు ఉపాసన కూడా అదే విధంగా చెప్పుకు రావడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!