సురేఖ-పద్మజ ప్రచారానికి వచ్చారు..మరి ఆ “మెగా” లేడీ ఎందుకు రాలేదు..? కావాలనే ఆపేశారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఏపీ రాజకీయాలలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మరికొద్ది గంటల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి . మరీ ముఖ్యంగా ఈసారి ఎప్పుడు లేని విధంగా ఏపీ ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా కదిలి వచ్చే విషయం తెలిసిందే. ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే మెగా ఫ్యామిలీ లేడీస్ ..ఈసారి మరిది కోసం అన్ని లిమిట్స్ క్రాస్ చేసి మరి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి పిఠాపురం వచ్చారు.

గతంలో నాగబాబు భార్య పద్మజ మరిది కోసం పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి భార్య సురేఖ సైతం పిఠాపురంలో మరిది కోసం ప్రచారం చేయడానికి సిద్ధమైంది . దీనికి సంబంధించిన పిక్చర్స్ వార్తలు మనం విన్నం. అయితే మరిది కోసమే సురేఖ – పద్మజ ప్రచారానికి వచ్చినప్పుడు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజినావో.. ఎందుకు రాలేదు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు నిజానికి అన్నా లేజీనోవో పిఠాపురంలో ప్రచారానికి రావాల్సింది అంటూ తెలుస్తుంది . కానీ ఆమె వస్తే ఎక్కడ మూడు పెళ్లిలు మేటర్ అంటూ మూడో భార్య అంటూ అవహేళనగా మాట్లాడతారు అని ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు ఆమెను ప్రచారానికి రాకుండా అడ్డుకున్నాయట .

ఇది తెలుసుకున్న జనసైనికులు మండిపడుతున్నారు. మా వదినని ప్రచారానికి రాకుండా అడ్డుకుంటారా ..?అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . అయితే కొంతమంది ఎవరు ప్రచారం చేసినా చేయకపోయినా.. పవర్ స్టార్ భారీ మెజారిటీతో గెలవడం తధ్యం అంటూ ముందుగానే ఏపీ రాజకీయాలలో జరగబోయే సంచలన విజయాలను గ్రహించేస్తున్నారు . మరి కొద్ది గంటల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి .

ఏపీ చరిత్రను తిరగరాసే రేంజ్ లో భారీ మెజారిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు . ఇప్పటికే ప్రభాస్ – రామ్ చరణ్ -చిరంజీవి -వరుణ్ తేజ్ -సాయి ధరంతేజ్ -నాని -నరేష్ -తేజ పలువురు హీరోయిన్లు సైతం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశారు..!!