కొడుకుకి ఉన్న ధైర్యం తండ్రికి లేదా.. ? పెంట పెంట చేస్తున్న మెగా ఫ్యాన్స్..!

మనకు తెలిసిందే .. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు . ఆయనకి సపోర్ట్ చేస్తూ పలువురు సినీ స్టార్స్ .. స్టార్ ప్రముఖులు ప్రచారానికి పిఠాపురం వస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా పలు వీడియోస్ ని రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు . నాగబాబు ..నాగబాబు భార్య.. వరుణ్ తేజ్.. సాయి ధరం తేజ్.. పిఠాపురం కి వెళ్లి మరి ప్రచారం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒక ట్వీట్ సోషల్ మీడియా వేదికగా చేసి చేతులు దులుపు చేసుకున్నాడు .

ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ తన అమ్మ సురేఖతో కలిసి పిఠాపురం కి వెళ్లారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సొంత కొడుకు రామ్ చరణ్.. బాబాయ్ కోసం మిగతా పట్టింపులు బాధలు, భయాలు అన్ని వదిలేసి ప్రచారం చేయడానికి వస్తే మీ తమ్ముడు ప్రజలకు సేవ చేయడానికి అంత తెగించి కష్టపడుతున్నప్పుడు ..నువ్వు ఒక్కరోజు ప్రచారం చేయలేవా..? అంత భయమా..? పై నుంచి ప్రజర్స్ కి అంత భయపడిపోతున్నావా..? అంటూ చిరంజీవిని ఏకేస్తున్నారు .

ఒక వీడియో రిలీజ్ చేయడం గొప్పకాదు .. నువ్వు పిఠాపురం కి వచ్చి నా తమ్ముడికి ఓటు వేయండి అంటూ ప్రజల్లో మాట్లాడితే అది పవన్ కళ్యాణ్ కి నిజంగా మేలు చేసినట్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో వీళ్ళు మెగా ఫాన్స్ అని చెప్పుకుంటున్నారు అని.. కానీ వాళ్ళు మెగా ఫాన్స్ కాదని కావాలనే మెగా ఫాన్స్ పేరుతో కొందరు ఈ విధంగా చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు..!!