వాట్.. రాజమౌళి లైఫ్ లో అల్లు అర్జున్ తో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడా.. కారణం అదేనా..?!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెలుగు వెలిగేలా చేశాడు. ప్రస్తుతం రాజమౌళి వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటూ పాన్ ఇండియ‌న‌ట్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి సెలబ్రిటీ రాజమౌళితో సినిమా ఛాన్స్ వస్తే బాగుందని కలలు కంటున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ అంతా ఎప్పుడెప్పుడు తమతో రాజమౌళి సినిమా తెరకెక్కిస్తాడా అనే ఆశతో ఉంటున్నారు. అయితే అల్లు అర్జున్ రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా లేరట. రాజమౌళి కూడా అల్లు అర్జున్‌తో ఇకపై సినిమా తీయబోయే చాన్సే లేదంటూ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇంతకీ దానికి కారణాలు ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం.

Magadheera (2009) - IMDb

గతంలో రాజమౌళి.. అల్లు అరవింద్‌ ప్రొడ్యూసర్‌గా, రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. రెండో సినిమాతోనే ఇండస్ట్రియల్ హిట్ కొట్టిన స్టార్‌గా రామ్ చరణ్ రికార్డ్స్ సృష్టించాడు. ఇక రాజమౌళి సినీ కెరీర్‌లో ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక అల్లు అరవింద్ సైతం అప్పటి వరకు ఉన్న తన ఆస్తి మొత్తాన్ని ఈ సినిమాపై నమ్మకంతో పెట్టి పని చేశారట. అలాగే రామ్ చరణ్ కూడా చాలా కష్టపడి స్టంట్ లు, గుర్రపు స్వారీలు చేసి సినిమాకు మరింత బ‌లాన్ని చేకూర్చాడు. ఇక సినిమా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ టైంకి ఈ మూవీ ఇది ఇంత సక్సెస్ సాధిస్తుందని ఎవరు భావించలేదు.

Pushpa star Allu Arjun to buy a sports team, here's what we know

పైగా అల్లు అరవింద్ ప్రతిసారి ఈ సినిమా కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టా అంటూ.. మాటిమాటికి చెప్తూ ఉండేవాడట. అలాగే చిరంజీవి కూడా కొన్ని ఇంటర్వ్యూలలో తన కొడుకు ఎంతో శ్రమించి సినిమాలో నటించాడు అంటూ వివరించాడు. అంతేకానీ రాజమౌళి క్రెడిట్ వల్ల ఇదంతా జరిగిందంటూ అల్లుఅర్జున్ గాని, చిరంజీవి గాని ఒక్కసారి కూడా ఎక్కడా ప్రస్తావించలేదట. దీంతో రాజమౌళి బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. అలాగే సినిమా రిలీజ్ అయినాక రాజమౌళికి ఇస్తానన్న షేర్స్ విషయంలో కూడా తేడా వచ్చిందని.. అల్లు అరవింద్ మాట తప్పారనే కోపంతో ఈ సినిమా సక్సెస్ అవడానికి కారణమే నేను.. రామ్ చరణ్ కాకపోతే ఓ ఈగని పెట్టి సినిమా తీసే సక్సెస్ సాధించే వాడిని అంటూ కోపంతో ఈగ సినిమా కాన్సెప్ట్ తెర‌కెక్కించ్చాడట రాజమౌళి. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అలా అల్లు అరవింద్ తో గొడవల కారణంగా అల్లు అర్జున్తో ఇకపై ఎప్పటికీ సినిమా తీయకూడదని రాజమౌళి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.