బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ముగ్గురు ఖాన్‌ల సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అది కామన్. వాళ్లలో ఏ ఒక్కరు సినిమా వచ్చిన థియేటర్లో కలకలలాడుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అలాగే అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ సినిమాలన్న ఫ్యామిలీ ఆడియన్స్ లో యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. హృతిక, రణ్‌బీర్, రణ్ వీర్ లాంటి క్రేజీ హీరోలు సినిమాలకు కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. కానీ ఈ ఏడాది అంతకుమించిన అంచనాలతో సౌత్ సినిమాల హవా బాలీవుడ్ లో కొనసాగుతుంది. సౌత్ సినిమాల వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి బాలీవుడ్ బిజినెస్ వర్గాలు.
పఠాన్, జవాన్, గాదర్ 2, యానిమల్ లాంటి సినిమాలతో గతేడాది ఫామ్ లో ఉన్నట్టు అనిపించిన బాలీవుడ్ ఈ ఏడాది మళ్లీ ఎదురుగాలి ఎదుర్కొంటుంది. భారీ బడ్జెట్లో వచ్చినసినిమాలు అంచనాలు రీచ్ కాలేదు. బడే మియా చోటే మియా సినిమా రూ.350 కోట్లతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి కనీసం రూ.100 కోట్లు కూడా తిరిగి రాబట్టలేదు. దాదాపు రూ.230 కోట్లతో రూపొందించిన మైదాన్‌కు రూ.65 కోట్లు మించి గ్రాస్ దక్కలేదు. ఇలాంటి ఉదాహరణలు బాలీవుడ్ సినిమాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో అక్కడ సరైన సినిమా లేకపోవడంతో సింగిల్ థియేటర్లే కాదు.. మల్టీప్లెక్స్లు కూడా ప్రదర్శన రద్దు చేసుకున్నాయి. ఈ పరిస్థితి ఐపిఎల్, ఎన్నికలు రెండు ఒకసారి రావడం పరోక్షంగా కారణమయ్యాయి. రాబోయే ఆరేడు నెలల్లో హిందీ సినిమాల్లో చెప్పుకోదగ్గ రేంజ్ లో ఏది లేవు.
అమీర్ ఖాన్ నటిస్తున్న సితారే జమీన్ పర్ మినహా.. ఖాన్ లు నటిస్తున్న సినిమాలు ఏవి ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. దీంతో థియేటర్లను మళ్ళీ కళకళలాడించే బాధ్యత సౌత్ హీరోలపై ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియన్ ట్రెండ్ కారణంగా సౌత్ సినిమాలకు స్టార్ హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు తెలుగు హీరోలు అయినప్పటికీ ఇక్కడ బలమైన మార్కెట్ను సొంతం చేసుకున్నారు. ఇక రజనీకాంత్, కమలహాసన్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు మొదటినుంచి బాలీవుడ్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో వీళ్లందరి సినిమాలు ఏడాది తృతీయ అర్థంలోనే రిలీజ్ కానున్నాయి. దీంతో బాలీవుడ్ బిజినెస్ సంస్థలు ఈ సినిమాల పైన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
దక్షిణాది హీరోల సినిమాలే మళ్లీ థియేటర్లోని కలకలలాడిస్తాయని నమ్మకంతో అక్కడి వర్గాలు ఉన్నట్లు సమాచారం. ప్రభాస్ నుంచి కల్కి 2898ఏడీ ఈ ఏడాదిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కళ తప్పిన బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ సినిమా కచ్చితంగా ఊరటే అని చెప్పాలి. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కోసం అక్కడ ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న సినిమా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 సినిమాతో పాటు.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా తర్కెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆర్‌ఆర్ఆర్ సినిమాతోనే సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా నటిస్తున్నాడు. శంకర్ సినిమాలకు బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంకా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలుకాకముందే హిందీలో రజనీకాంత్, కమలహాసన్ తమ సత్తా చాటుకున్నారు. ఇక ప్రస్తుతం కమల్ ఇండియన్ 2, రజినీకాంత్ వెట్టయాన్ సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లో ద్వితీయ అర్థంలోనే రిలీజ్ చేయనున్నారు. వీరిద్దరితో పాటు తమిళ్లో మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలు ద్వితీయార్థంలో రిలీజ్ కానున్నాయి. సూర్య హీరోగా కంగువా, విజయ్ గోట్, విక్రమ్ తంగలాన్ సినిమాలు కూడా ఈడదిలోనే రిలీజ్ చేస్తారంటూ సమాచారం.