టాలీవుడ్ బ్యూటీ పాయాల్ రాజ్‌పుత్ ఇటీవల మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్.. నాగార్జున టైటిల్ తో వస్తున్న రక్షణ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. రోషన్, మానస తదితరులు కీలకపాత్రలో మెప్పించనున్న ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. ఇక ఇప్పటికే మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై.. ప్రాణదీప్ ఠాకూర్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రాణదీప్ ఠాకూర్ శ్రమిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అయితే పాయల్ రాజ్పుత్ ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల కంటే ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని.. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా రూపొందుతుందని తెలుస్తుంది.
ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది పాయల్. రక్షణ మూవీ ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తిగా రాసుకున్న కథ అని తెలుస్తుంది. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులనూ పూర్తిచేసి రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారట. మహతి సర్వసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.