‘ కన్నప్ప’ లో సూపర్ ట్విస్ట్.. రోల్ చేంజ్ చేసిన ప్రభాస్.. ఏ పాత్రలో నటిస్తున్నాడంటే..?!

మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా.. కన్నప్ప సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర కన్నప్ప రోల్ మంచు విష్ణు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాలో భారీ తారగ‌ణం నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవడం.. అత్యంత భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు బయటకు వచ్చిన.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చివరిగా మంచు విష్ణు ప్రభాస్ కు సంబంధించిన ఓ అప్డేట్ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ప్రభాస్ షూట్లో జాయిన్ అయ్యాడు అంటూ ఆయన ఇచ్చిన అప్డేట్ దాదాపు 18 గంటల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ఉంది.

Prabhas, Mohanlal Feature in Vishnu Manchu's Epic 'Kannappa'

ఇప్పటికే కన్నప్పలో ఎంతోమంది స్టార్ నటులు గొప్ప పాత్రలలో పోషించడానికి సిద్ధమయ్యారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ విషయం చెప్తున్నా అంటూ మంచు విష్ణు తాజాగా మరో అప్డేట్ షేర్ చేసుకున్నాడు. కన్నప్ప సినిమాను నేను చేస్తున్న.. నువ్వు క్యారెక్టర్ చేయాలని విష్ణు మొదట ప్రభాస్‌కు చెప్పాడట. కథ బాగా నచ్చింది నాకు ఆ పాత్ర ఇంకా బాగా నచ్చింది నేను ఈ క్యారెక్టర్ తప్పకుండా చేస్తా అని ప్రభాస్ చెప్పాడని.. నేను చెప్పిన పాత్ర కాకుండా ప్రభాస్‌కు నచ్చిన పాత్రలో ఆయన నటిస్తున్నాడని వివరించాడు మంచు విష్ణు. సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తా.. అధికారికంగా ఆ పాత్రల గురించి మేము చెప్పినప్పుడు మాత్రమే నమ్మండి అంటూ ఆయన వివరించాడు.

Prabhas to work with Vishnu Manchu in 'Kannappa'. Will he play Lord Shiva? - India Today

బయట వచ్చే పుకార్లన్నీ అవాస్తవాలను తెలియజేసిన విష్ణు. త్వరలోనే అన్ని పాత్రల గురించి అనౌన్స్మెంట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. సోమవారం నాడు ఓ అద్భుతమైన అప్డేట్ రానుంది అంటూ ఆయన వివరించాడు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెమెరామెన్ గా, సినిమాటోగ్రాఫర్ గా హాలీవుడ్ నుంచి ప్రముఖ స్టార్ సెలబ్రిటీస్ పనిచేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, అందర్నీ ఆకట్టుకునే కథ‌, కంటెంట్తో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.