మరో వివాదంలో ఆది పురుష్.. కారణం తెలిస్తే షాక్..!

ఆది పురుష్.. రావణుడు అచ్చు బ్రాహ్మణుడు నికార్సైన భక్తుడు.. మహా చక్రవర్తి.. శివ భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావణుడు.. బ్రాహ్మణుడు అని అందరికీ తెలిసిందే. ఇకపోతే రావణుడిని రాముడు వధించిన కారణంగా విజయదశమిని మనం జరుపుకుంటాము అయితే.. విజయదశమి రోజున రావణుడి విగ్రహాలను తగలబెట్టడంపై కొంత వ్యతిరేకత కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది. ఎందుకంటే రావణుడికి కొన్ని దేశాలలో కొన్నిచోట్ల దేవాలయాలు కూడా ఉన్నాయి. రావణుడు రాముడిచేత వధింపబడడానికి కారణం సీతాదేవిని ఎత్తుకెళ్లడమే.. ఇకపోతే ఆ రావణుడు శివుడి భక్తుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. మరి ఆది పురుష్ సినిమాలో బ్రాహ్మణుడైన రావణుడిని విలన్ గా చూపించే క్రమంలో ముస్లిం విలన్ అనిపించేలా ఆ పాత్రని డిజైన్ చేసినట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Adipurush Teaser Starring Prabhas Saif Ali Khan Kriti Sanon
ఇక ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఆ పాత్రని డిజైన్ చేసిన తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఈయన పట్ల ఎప్పటినుంచో ఒక వర్గం ప్రేక్షకులలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అది కాస్త ఇప్పుడు ఆది పురుష్ సినిమాకి లేనిపోని వివాదాలను తెచ్చిపెట్టడానికి కారణమవుతోంది.. బ్రాహ్మణుడైన రావణుడి ముఖం ముస్లిం ముఖాన్ని ప్రతిబింబిస్తోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా విపరీతంగా ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. దీంతో ఆది పురుష్ సినిమా మరొకసారి వివాదంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Adipurush teaser: Prabhas must battle fearsome Lankesh and horrible VFX |  Bollywood - Hindustan Times

మరొక పక్క హనుమంతుడి పాత్రను కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు. నిజానికి ఇందులో పాత్రలన్నీ కూడా కార్టూన్ గా పిల్లలకు నచ్చే విధంగా మాత్రమే ఉన్నాయి అలాంటప్పుడు ఈ సినిమా ఎలా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిజాస్టర్ అయితే మాత్రం నిర్మాతలు పూర్తిస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది.