కృతి శెట్టి కూడా రష్మిక బాటనుందా..?

ఉప్పెన చిత్రంతో వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకున్నది హీరోయిన్ కృతి శెట్టి. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ క్రమంలోని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకుంటూ చాలా బిజీగా ఉన్నది. కానీ సినిమాల విషయంలో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లుగా మారిపోయింది ఈమె పరిస్థితి. వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులను చవిచూసింది. ప్రస్తుతం ఈమె కెరియర్ డేంజర్ లో ఉందని చెప్పవచ్చు

Rashmika - Krithi Shetty పోటీకి సిద్దమైన రష్మిక మందన - కృతి శెట్టి... ఈ  కన్నడ భామలలో నెగ్గేది ఎవరో..!
ఇక దీంతో ఈమె తేరుకొని మంచి కథ , తన నటనకు ఆస్కారం ఉన్న పాత్రలని ఎంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అతి తక్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చి అసాధారణమైన స్టార్డమ్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే రష్మిక బాటలో పట్టే విధంగా కెరీర్ని ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక కూడా అవకాశాల కోసం వేణు స్వామితో పలు పూజలు చేయించి స్టార్ హీరోయిన్ పొజిషన్ ని అందుకుందని వేణు స్వామి ఎన్నోసార్లు తెలియజేశారు.

ఇప్పుడు కృతి శెట్టి కూడా ఈమెను ఫాలో అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దోష నివారణ కోసం పలు పూజలు చేయిస్తోంది అన్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కృతి శెట్టి తల్లి వేణు స్వామిని వెళ్లి సంప్రదించమనగా అందుకు అంగీకరించినట్లుగా కూడా సమాచారం. ఇక దీంతో ఆమె దోష నివారణ పూజలు కూడా చేయించారని ఒక వార్త వైరల్ గా మారుతుంది . మరి ఈ ముద్దుగుమ్మకు ఇలా అయినా కెరియర్ పరంగా సక్సెస్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.