చాలా రోజుల తరువాత మళ్లీ అంతా ఒక్క చోట చేరిన అక్కినేని ఫ్యామిలీ..స్పెషల్ ఏంటంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీ అంతా మళ్ళి కలిసి ఒక చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . పెరిగిపోతున్న బిజీ షెడ్యూల్ కి ఇంట్లో ఒక సెలబ్రిటీ ఇద్దరు సెలబ్రిటీలు ఉంటేనే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఇంట్లో ఉండే వాళ్ళు అంత టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .

ఎప్పుడో పండక్కో పబ్బంకో మాత్రమే కలుస్తారు . అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీస్ అంతా ఒకచోటగా వాలిపోయారు . ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . నేడు ఆదివారం సెలవు దినం కావడంతో పైగా రేపు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు కావడంతో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లిపోయారు . దీంతో అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒకచోట చేరారు.

అక్కినేని కజిన్స్ అంతా ఓకే చోట చేరి సందడి సందడి చేశారు . సరదాగా టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి . హీరో సుశాంత్ అక్కినేని వారి కుటుంబంలోని కజిన్స్ ..నాగచైతన్య ..అఖిల్ ..సుమంత్..అందరూ కూడా ఫొటోస్ లో చాలా స్మైలీగా కనిపిస్తున్నారు . ఈ ఫోటో ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది . ఈ ఫోటోని అక్కినేని అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!