చంద్రబాబు గెలవాలని ఏకంగా దాన్నే కోసేసుకున్న అభిమాని..కొంప ముంచేశావ్ కదా బ్రో..!

ప్రజెంట్ ఇదే న్యూస్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గెలవాలి అంటూ ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది . కేవలం కొద్ది గంటలు అంటే మరికొద్ది గంటల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కాబోతుంది . ఇప్పటికే రాజకీయ నాయకులు తమదైన స్టైల్ లో ప్రచారం చేసి తాము అధికారం చేపడితే ఏ రేంజ్ లో ప్రజలకు సేవ చేస్తాము ..? ఏ విధంగా ఆదుకుంటాము ..? అని కొత్త కొత్త మేనిఫెస్టోలను విడుదల చేశారు .

రాజకీయ నాయకుల మధ్య హోరాహోరీ గా మాటలు యుద్ధం కూడా జరిగింది కొందరు జనాలు టిడిపికి మరికొందరు జనాలు వైసిపికి మరి కొంతమంది జనాలు జనసేనకు సపోర్ట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు అంటే విపరీతమైన అభిమానంతో గౌరవంతో ఒక వ్యక్తి ఏకంగా నాలుక కోసుకున్న ఘటన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగింది . చంద్రబాబునాయుడు గెలవాలి అని చాలామంది కోరుకుంటున్నారు . ప్రత్యేక పూజలు కూడా చేయిస్తున్నారు .

అయితే ఈ వ్యక్తి మాత్రం ఒక అడుగు ముందుకేసాడు . ఎంతలా అంటే ఏకంగా ఆయన గెలవాలి అని తన నాలికను కట్ చేసుకుని ఒక పేపర్ మీద రాశాడు . ఆ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది . “నా పేరు చేవల మహేష్ పశ్చిమగోదావరి జిల్లా గూటల గ్రామం ..గతంలో వైయస్సార్ జగన్ సీఎం కావాలని ఇక్కడే నాలుక కోసుకొని ముక్కు తీర్చుకున్న ..ఇప్పుడు చంద్రబాబు సీఎం కావాలి అని పవన్ , లోకేష్ గెలవాలి అని నాలిక కోసుకున్న అని రాశాడు “. దీంతో ఏపీ రాజకీయాలల్లో ఇతగాడి చేసిన పని హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టిడిపి శ్రేణులు ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది ఇది తెలుసుకొని షాక్ అయిపోతున్నారు..!!