వరుణ్-లావణ్య బాటలో మరో ప్రేమ జంట..పెళ్లి చేసుకోబోతున్న మరో స్టార్ హీరో-హీరోయిన్..!

ఎస్ ప్రజెంట్ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . త్వరలోనే తెలుగు హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇండస్ట్రీలో హీరో హీరోయిన్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి . కొంతమంది బుద్ధిగా కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే మరి కొంతమంది బాండింగ్ లేదు అంటూ చెత్త రీజన్లతో విడాకులు తీసుకుంటున్నారు .

కాగా వరుణ్ – లావణ్య తర్వాత ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మారింది. వాళ్ళు మరెవరో కాదు వాన సినిమాతో సూపర్ స్టార్ హీరోగా మారిన వినయ్ రాయ్.. అదేవిధంగా గాయం 2 సినిమాలో హీరోయిన్గా నటించిన విమల రామన్ . విమల రామన్ భారత సంతతికి చెందిన ఎన్నారై మహిళ . తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉంటారు . పుట్టి పెరిగింది కూడా అక్కడే ..

ఆమె గత కొంతకాలంగా హీరో వినయ్ రాయ్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ వార్తలు వినిపించాయి . ఫైనల్లీ ఆ విషయాన్ని కన్ఫామ్ చేసేసింది విమల రామన్ . తాజాగా ప్రియుడితో ఘాటు రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఒడిలో కాళ్లు పెట్టుకొని ..ఒకరి ఒడిలో ఒకరు పడుకోని ఘాటుఘాటు హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది ఈ లవబుల్ కాబోయే కొత్తజంట. సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!