వాళ్లేం చేస్తారో నాకేం తెలుసు.. భార్యాపిల్లలపై వైసీపీ అభ్యర్థి మాట..!

చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి మాత్రం ఉన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలే ఏకైక కార్యక్రమంగా పెట్టుకుని పెత్తనం చేసిన వైసీపీ నేతల తీరు గురువింద గింజలను తలపిస్తుంది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి అంటే చెప్పుకోవడానికి ఒకటి లేకపోయినా… అరాచకాల జాబితా మాత్రం పెద్దగానే ఉంది. ఇంతకాలం ఇతరులను మాత్రమే వైసిపి నేతలు ఇబ్బందులు పెట్టారని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత గాని వీళ్ళ అసలు స్వరూపం బయటపడలేదు. చివరికి సొంత కుటుంబ సభ్యులను సైతం తన్ని తరిమేసిన చరిత్ర వైసీపీ నేతలకే దక్కుతుంది. భారతదేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే వివాహ వ్యవస్థను కూడా వైసిపి నేతలు బ్రష్టు పట్టించారు. కట్టుకున్న భార్యని కన్న కూతుళ్ళను సైతం చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారని గగుర్పాటుకగగుర్పాటు కల్పించే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ఐదేళ్లుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేయటమే లక్ష్యంగా పనిచేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ పెళ్లిళ్లపై కామెంట్ చేసిన మంత్రిగారు సొంత తమ్ముడి తీరును మాత్రం దాచిపెట్టారు. అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళి ప్రస్తుతం పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఐదేళ్లుగా ఇసుక మాఫియా, భూకబ్జాలతో అక్రమాలకు పాల్పడిన మురళీకృష్ణ లీలలు ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత వెలుగులోకి రావడంతో ఈయన మన అభ్యర్థి అని పొన్నూరు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

కట్టుకున్న భార్య ఏం చేస్తున్నారో తెలియదంట.. అలాగే కన్న కూతుళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు అంటున్నాడు సదర్ వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ. అసలు వాళ్ల వివరాలు తనకు తెలియదు అంటున్నాడు. ఈ మాట ఎవరో చెప్పింది కాదు… ఎన్నికల అఫిడవిట్ లో అంబటి మురళీకృష్ణ స్వయంగా దాఖలు చేసిన వివరాలు. భార్యను కూతుళ్ళని తీవ్రంగా వేధించిన మురళీ వారిని నడిరోడ్డుపై వదిలేశాడని సొంత మనుషులే చెప్తున్నారు. చివరికి కూతురు పదో తరగతి పరీక్షలు రాస్తుంటే చదువు సాగకూడదనే అక్కసుతో ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపేసి పైశాచిక ఆనందం పొందాడని మురళి సన్నిహితులే చెబుతున్నారు. తండ్రి అండ లేకున్నా.. కష్టపడి చదువుకుని ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తోంది. భార్యా పిల్లల్ని గాలికి వదిలేసిన మురళి మనకు మంచి పరిపాలన ఎలా అందిస్తాడు అని ప్రస్తుతం పొన్నూరు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అన్న పాపానికి మొన్నటి వరకు దొంగను ఎన్నుకున్నామని… ఇప్పుడు ఆయన స్థానంలో గజదొంగ పోటీ చేస్తున్నాడంటూ పొన్నూరులో పుకార్లు షికారు చేస్తున్నాయి.

అన్న అంబటి రాంబాబు పై కూడా సొంత అల్లుడు తీవ్ర విమర్శలు చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా మామ నీచుడు అంటూ రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ చేసిన వీడియో మంత్రి గారి తీరును బయటపెడుతుంది. కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని నేతలనా మనం ఎన్నుకోవాల్సింది అని ఏపీ ఓటర్లు చర్చించుకుంటున్నారు. అధినేత తల్లిని చెల్లిని తరిమేస్తే, అభ్యర్థి భార్యని పిల్లల్ని బజారున పడేసాడని పొన్నూరు ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.