100 కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. ప్రభాస్ డేరింగ్ డెసీషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

కోట్లు ఇచ్చినా కూడా కొందరు హీరోలు కొన్ని కొన్ని పనులు చేయరు . వాళ్ళల్లో ఒకరే మన ప్రభాస్ . డార్లింగ్ అంటూ ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే ప్రభాస్ మరికొద్ది రోజుల్లోనే తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఒక బడా ప్రాజెక్టును మిస్ చేసుకున్న డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో స్టేటస్ సంపాదించుకున్నాక మిస్ చేసుకున్న సినిమాలు మాత్రం చాలా చాలా తక్కువ. వాటిల్లో ఒకటే వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారు . నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా అయాన్ ముఖర్జీ – హృతిక్ రోషన్ ఇద్దరూ కూడా ప్రభాస్ ని చూస్ చేసుకున్నారట .

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కి మంచి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే ప్రభాస్ మాత్రం నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించను అంటూ తెగేసి చెప్పేసాడట. అంతేకాదు 100 కోట్ల రెమ్యూఅనరేషన్ ఆఫర్ చేసిన కూడా సింపుల్ గా నో అంటూ కొట్టి పడేయడం అప్పట్లో అభిమానులకి చాలా చాలా నచ్చేసింది. నచ్చితేనే ఎలాంటి పాత్రైనా చేస్తాడు ప్రభాస్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు అభిమానులు. డార్లింగ్ డేరింగ్ డెసిషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు..!!