కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే ఆ హీరోకి సిగ్గు-సరం లేదా..? ఇంత పిరికోడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు ఘాటుగా మాట్లాడే పద్ధతిని ఎక్కువగా అలవాటు చేసుకున్నట్లు ఉన్నారు . అది ఎంత పెద్ద స్టార్ హీరో అయిన హీరోయిన్ అయినా సరే ఉన్నది ఉన్నట్లు తమ ఒపీనియన్ బయట పెట్టేస్తున్నారు . రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక తెలుగు హీరోని ఏకీపారేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఘాటు ఘాటు మెసేజ్లతో కౌంటర్లతో ఆ హీరోని ట్రోల్ చేస్తున్నారు . దానికి కారణం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకపోవడం . మనకు తెలిసిందే మరికొద్ది గంటల్లో మొదలు కాబోతున్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.

ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంది. మెగా ఫ్యామిలీ లేడీస్ కూడా పిఠాపురం కి వచ్చి పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలి అంటూ ప్రచారం చేశారు. చాలామంది పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలి అని ఆయన అసలైన లీడర్ అని సపోర్ట్ చేశారు . అయితే ఆయన ఫ్రెండ్ గా ఉంటూ ఆయన చేత గిఫ్ట్ లు అందుకుంటూ ఆయన పేరు చెప్పుకొని బ్రతికే ఒక హీరో మాత్రం ఆయనకు సపోర్ట్ చేయలేదు.

దానికి కారణం పలు బిజినెస్ లతో కొంతమంది పెద్ద మనుషులతో ఆ హీరోకి లింకప్ ఉండడమే. అది పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్లతో లింకప్ ఉండడంతో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పుకునే ఆ హీరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా ఎలా ఉండగలరు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు పవన్ అభిమానులు . అంతేకాదు కొంతమంది పరోక్షకంగా హెల్ప్ తీసుకునే వాళ్ళకి హెల్ప్ చేసే అంత పెద్ద మనసు ఉండదు ..సిగ్గు – శరం లేని హీరోలు అంతే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరి కొందరు కోట్ల ఆస్తి ఉన్న ఆ హీరో ఇంత పిరికివాడా అంటూ షాక్ అయిపోతున్నారు…!!