నన్ను అలా చూడడమే రణ్‌బీర్ కు ఇష్టం.. అందుకే అలానే ఉంటా.. ఆలియా భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మ‌రింత దగ్గర అయింది. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న ఆలియా తన భర్త ర‌ణ్‌బీర్‌, కూతురు రాహతో పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే కెరీర్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక తాజాగా అలియాభట్ బజార్ ఇండియా మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం డిజైనర్ డ్రెస్ లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అయింది. ఈ ఫోటోలో అలియా స్టిల్ కు యువత ఫిదా అవుతున్నారు. తల్లి అయినా కూడా తగ్గేదెలే అంటూ ఆలియా అందాన్ని ఆరబోస్తూ అభిమానులను మరింతగా పెంచుకుంటుందన‌టంలో అతిశ‌యోక్తి లేదు. ఈ విషయంపై ముద్దుగుమ్మ అలియా స్పందిస్తూ తల్లి కావడానికి.. అందానికి సంబంధం లేదు.. ఇంకా చెప్పాలంటే అమ్మ అయిన తర్వాతే ఆడవాళ్ళ అందం మరింతగా పెరుగుతుంది.

ఈ విషయం భర్తలకి బాగా తెలుస్తుంది. నేను ఇప్పటికి టీనేజ్ గ్రూపులో కనిపిస్తున్న అంటే దానికి కారణం రెణ్‌బీర్. నేను ఇలా ఉండడమే ఆయనకు చాలా ఇష్టం. అందుకే అలానే ఉండాలనుకుంటున్నా. మీ అందరికీ కూడా అలానే కనిపిస్తున్న అంటూ కామెంట్స్ చేసింది. నవ్వుతూ అందంగా అలియా చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జిగ్రా సినిమాతో నిర్మాతగా మారింది.