రేపు మన స్టార్ హీరోలు ఎక్కడెక్కడ ఓటు వేస్తున్నారో తెలుసా..? ఆయన మోర్ స్పెషల్..!!

మరికొద్ది గంటల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సర్వత్ర ఉత్కంఠత నెలకొంది . మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండడంతో అందరి కళ్ళు ఆ నియోజకవర్గం పై పడ్డాయి . కాగా రేపు ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

అదే విధంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి . ఇక మన టాప్ మోస్ట్ సినీ సెలబ్రెటీస్ చాలామంది హైదరాబాద్లో ఓటు వేస్తున్నారు . రేపు మన స్టార్ సెలబ్రిటీస్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఓట్లు వేస్తున్నారు వాళ్ళ ఓటుని ఎలా వినియోగించుకోబోతున్నారు అనే విషయం ఇక్కడ ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!

* ఓబుల్‌రెడ్డి స్కూల్‌‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

* జూబ్లీహిల్స్ లో భ్శ్ణ్ళ్ సెంటర్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌,

* జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, జీవిత, రాజశేఖర్,

*FNCC కార్యాలయంలో రాఘవేంద్రరావు, విశ్వక్‌సేన్‌, దగ్గుబాటి రానా, సురేశ్‌ బాబు,

*జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్‌,

* జూబ్లీ హిల్స్ న్యూ ఎమ్మెల్యే కాలనీలో రవితేజ

* వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

* మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం

* షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, రమా రాజమౌళి

* బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని

* గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాల లో హీరో నాని తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు