నో డౌట్: విశాఖ లీడ్ చేంజ్?

ఇప్పుడు రాజకీయమంతా విశాఖ చుట్టూనే తిరుగుతుంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్‌తో వైసీపీ పోరాటం చేస్తుంది. అధికారంలో ఉండి కూడా…రాజధాని ఏర్పాటు చేయకుండా వైసీపీ పోరాట పంథా ఎంచుకోవడం వెనుక రాజకీయ కోణం క్లియర్‌గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నారు..పైగా మూడేళ్ళ ముందే మూడు రాజధానులు అన్నారు. కానీ ఇంతవరకు ఏది అమలు కాలేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకునే పరిస్తితి లేదు.

ఇప్పుడు పోరాటం అంటే..ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ లబ్ది పొందడమే వైసీపీ టార్గెట్‌గా ఉంది. ఆ విషయం క్లియర్‌గా అర్ధమవుతుంది. ఇక వైసీపీ రాజకీయ క్రీడకు బ్రేకులు వేయాలని టీడీపీ ట్రై చేస్తుంది. రాజధాని పేరుతో విశాఖని వైసీపీ దోచేసుకుంటుందని ఆరోపిస్తుంది. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో టీడీపీ సైతం ఉత్తరాంధ్రలో తమ బలం తగ్గకుండా చూసుకోవాలని చూస్తుంది. ఇక్కడ టీడీపీది రాజకీయ కోణమే. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..విశాఖ వైసీపీ గర్జన పెట్టుకున్న సమయంలోనే విశాఖలో ఎంట్రీ ఇచ్చారు.

ఉత్తరాంధ్రలో ప్రజా సమస్యలపై జనవాణి కార్యక్రమం పెడుతున్నారు. ఇక పవన్ ఎయిర్‌పోర్టుకు వచ్చే సమయంలో మంత్రులు రోజా, జోగి రమేష్‌లు సైతం అక్కడకి రావడంతో జనసేన శ్రేణులు నిరసనలు తెలిపాయి. దీంతో పెద్ద రచ్చ అయింది. మొత్తానికి మూడు పార్టీలు కలిసి ఉత్తరాంధ్రలో రచ్చ లేపాయి.

అయితే రాజకీయంగా చూసుకుంటే వైసీపీ విశాఖ రాజధాని సెంటిమెంట్‌ని అక్కడి ప్రజల్లో నిదానంగా వచ్చేలా చేస్తుంది. అది మరింత పెరిగితే వైసీపీకి బెనిఫిట్. అలా కాకుండా వైసీపీ రాజకీయాన్ని టీడీపీ బయటపెట్టగలిగితే టీడీపీకి ప్లస్. కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు ఎవరి రాజకీయం ఏంటి అనేది క్లారిటీగా  అర్ధమవుతున్నట్లు ఉంది. ఇదే సమయంలో టీడీపీ-జనసేన గాని కలిస్తే విశాఖలో లీడ్..ఆ పార్టీలదే అవుతుంది..వైసీపీ ఎంత రాజకీయం చేసిన వర్కౌట్ అవ్వదు. ఇప్పటికే విశాఖలో లీడ్ మారుతుందని రాజధాని సెంటిమెంట్‌తో వచ్చారు. ఇది గాని రివర్స్ అయితే..విశాఖలో వైసీపీ మునుగుతుంది..టీడీపీ-జనసేనకు లీడింగ్ ఉంటుంది.