సినిమా చివర్లో హీరో చనిపోతే సినిమా ఆడదా… అందుకే ఈ హీరోలు ప్లాప్ అయ్యారా..!

కోలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి, టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి చాలా విరుద్ధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమాలుు హిట్ అవ్వవు.. అన్న విషయం మనకు తెలిసిందే. మీడియం రేంజ్ హీరోలు కొత్త హీరోల సినిమా విషయంలోనే ఈ తరహా క్లైమాక్స్ లను ప్రేక్షకులు అంగీకరించినప్పటికీ.. స్టార్ హీరోల సినిమాలకు వచ్చేటప్పటికి క్లైమాక్స్ లో హీరోలు చనిపోతే ప్రేక్షకులు అంగీకరించరు.

Watch Chakram Full Movie Online for Free in HD Quality | Download Now

కొన్ని సినిమాలు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉన్నప్పటికీ చివర్లో హీరో చనిపోవడం వల్ల ప్లాప్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ప్రభాస్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చక్రం సినిమా ఎంతో బాగుంటుంది.. ఇప్పటికి యూట్యూబ్లో బుల్లితెర మీద మనం చూడకుండా ఉండ‌లేం.. అలాంటిది ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఆకట్టుకోకపోవటానికి ప్రధాన కారణం సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. దీనివల్ల సినిమా స్టోరీ బాగున్న ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

VEDAM Trailer - YouTube

సీనియర్ హీరో నాగార్జున నటించిన అంతం సినిమా సైతం ఫ్లాఫ్ కావడానికి క్లైమాక్స్ లో హీరో చనిపోవడమే ముఖ్య కారణమని మనకు తెలిసిందే. వైవిద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో వచ్చిన సినిమా వేదం. ఈ సినిమా విషయంలో కూడా క్లైమాక్స్ లో హీరోలు చనిపోతారన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతంం చేసుకున్న… కలెక్షన్లను సరిగ్గా రాబట్ట‌ లేకపోయింది. ప్రధాన కారణం ఈ సినిమా చివరిలో ఇందులో నటించిన హీరోలు ఇద్దరు చనిపోవటమే.

Watch Tagore Full Movie Online for Free in HD Quality | Download Now

ఈ క్రమంలోనే పలు సీనియర్ హీరోలు తమ సినిమా క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు.. కొన్ని సినిమాలు క్లైమాక్స్ మార్పు చేయడం వ‌ల్లానే సూపర్ హిట్ అయ్యాయని కూడా చెప్పవచ్చు.. ఈ కోవాలోకే వస్తుంది చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా. ఈ సినిమాను తమిళ్ లో విజయ్ కాంత్ నటించిన సినిమాకి రీమేక్ తెలుగులో తీశారు.. తమిళ్‌లో క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు.. తెలుగులో కొంత స్టోరీని మార్చి తెరకెక్కించగా ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సినిమా మొత్తం ఒక ఎత్తు క్లైమాక్స్ ఒక ఎత్తు కొన్ని సినిమాలు క్లైమాక్స్ వల్లే సూపర్ హిట్ అయ్యాని కూడా చెప్పవచ్చు.