పెళ్లిపై ఘాటుగానే స్పందించిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో ఉండనే ఉంటుంది. చేసింది సినిమాలు తక్కువే అయినా పలు సందర్భాలలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ పెళ్లి జరిగిందని సోషల్ మీడియా సైట్లలో వార్తలు జోరుగా ప్రచారంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్వా చౌత్ పండుగ సందర్భంగా పూనమ్ కౌర్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె పెళ్లి గురించి మాట్లాడేలా చేస్తున్నాయి. అయితే ఇలాంటి విషయాలపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యి చాలా ఘాటుగా సమాధానాన్ని ఇచ్చింది వాటి గురించి చూద్దాం.

PK Karva Chaut controversy | cinejosh.com
కార్వా చౌత్ పండుగను వివాహం కాని అమ్మాయిలు తమకు కాబోయే భర్తల కోసం జరుపుకుంటారని తెలియజేసింది.పెళ్లి కానీ అమ్మాయిలు చంద్రునికి బదులుగా చుక్కలను ఆరాధిస్తారని పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది. ఎందుకు తన గురించి తన పెళ్లి గురించి ఎక్కువగా ఆర్టికల్స్ వైరల్ గా అవుతున్నాయా తనకు అర్థం కావడం లేదని తెలుపుతోంది. వైరల్ అయిన ఆర్టికల్స్ రాజకీయపరమైన కారణాలతో వైరల్ అవుతున్నాయా లేక మిషనరీ ఆలోచన విధానంలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి అర్థం కాలేదని పూనమ్ కౌర్ కామెంట్లు చేస్తోంది.

అయితే ఎడ్యుకేటెడ్ యువర్ సెల్ఫ్ అంటూ పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చిన ఈ నేపథ్యంలో తన పెళ్లి పై వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టిందని చెప్పవచ్చు. దీంతో ఇప్పటికైనా ఈ విషయాలు ఆగుతాయేమో చూడాలి. అంతేకాకుండా ఈమె అభిమానులు సైతం పెళ్లిపై పూనంకవును హర్ట్ చేశారని అందుచేతనే ఈమె ఇంత ఘాటుగా రియాక్షన్ ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.