జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ఆయన పార్టీ పుంజుకుందని .. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. చెప్పేశారు. వాస్తవానికి దీనిని ప్రత్యేకంగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికలకు ముందు.. అంతకు ముందు జరిగిన ఎన్నికలకు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధారణమైన సినిమా ఫాలోయింగ్.. యువతలో క్రేజ్.. వంటివి పవన్ ను పవన్ పెట్టిన పార్టీని.. ప్రజల్లోకి బలంగానే తీసుకువెళ్లాయి.
దీంతో పవన్ ఎక్కడ ఎలాంటి సభలు పెట్టినా.. ర్యాలీలు చేసినా ప్రజలు తండోపతండాలు వచ్చారు. కీల కమైన.. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం.. జిల్లా కడపలోనూ.. పవన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక, ఇక్కడే ఇంత ఫాలోయింగ్ ఉంటే.. రాష్ట్రంలోని ఉభయగోదావరులు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇంకెంత ఫాలోయింగ్ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా.. పవన్. ప్రజల్లో పార్టీ పుంజుకుందని అన్నారు.
అయితే.. దీనిపై తాజాగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో పుంజుకున్నది పార్టీ కాదని.. పవన్ ఫాలోయింగ్ అని అంటున్నారు. కానీ, ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించేది మాత్రం .. ఓటింగ్ పర్సంటేజేనని.. చెబుతున్నారు. ఫాలోయింగ్ ఉండి.. ప్రజాదరణ ఉండి కూడా.. ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం లేదని.. అంటున్నారు. గత ఎన్నికలకు ముందు… పవన్ వ్యూహాత్మకంగా ఒంటరి పయనం చేసినప్పుడు.. ప్రజలు ఆయనను ఫాలో అయ్యారు.
అయితే.. ఇప్పటికీ.. అదే చరిష్మా ఉంది. ఈ విషయంలో సందేహం లేదు. కానీ, ప్రజాదరణ అంటే.. పవ న్కు జైకొట్టడమే కాదు.. పోలింగ్ బూత్‌లో ఓటు గుద్దడం కూడా కీలకమేనని అంటున్నారు పరిశీలకులు. అంటే.. పవన్ దృష్టిలో ప్రజాదరణ పెరిగిందంటే.. అర్ధం.. ఆయన ప్రసంగాలకు.. లైకులు.. సభలకు జనాలు పెరగడమా? లేక.. ఓటు బ్యాంకు పెరగడమా? అనేది ఇప్పుడు తెరమీదికి వచ్చిన ప్రశ్న. మరి దీనికి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.