సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటన అగిరిపల్లి అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు గల కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కట్టిన పవన్ బ్యానర్ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ చించేయడంతో ఈ గొడవ ప్రారంభమైందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు 30, 40 మంది యువకులు తమ హీరో బ్యానర్ ని చించేస్తారా? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీదకు దాడికి దిగారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడి చేయడంతో పలువురు అభిమానులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ గొడవలో దాదాపు 60, 70 మంది ఉన్నారని సమాచారం అందుతుంది. ఈ విషయం తెలిసిన నేటి జెన్లు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గొడవలు కొత్తేమి కాదు.. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలా దాడులకు పాల్పడ్డారు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజజీవితంలో హీరోలు బాగానే ఉన్నప్పటికీ అభిమానుల మధ్య మాత్రం గొడవలు జరగడం తగ్గడం లేదు.