అనంతలో చౌదరీకి సీటు కష్టాలు..!

అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అంతా అనుకుంటారు…అయితే ఒకప్పుడు అనంతలో టీడీపీకి కలిసొచ్చింది..కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారింది..అక్కడ వైసీపీ పాగా వేసింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు, టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే నిదానంగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం వలన టీడీపీకి కలిసొస్తుందని అనుకోవడానికి లేదు. వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో మాత్రం […]

త‌మ్ముళ్ల మ‌ధ్య గొడ‌వ పెట్టిన చంద్ర‌బాబు… త‌న్నుకుంటున్నారుగా…!

తాంబూలాలిచ్చేశాను.. త‌న్నుకు చావండి! అని క‌న్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నేత‌లు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీల‌క‌మైన డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబం ధించి.. నాయ‌కులు త‌న్నుకులాడుతున్నారు. డోన్ నియోజ‌క‌వ‌ర్గంపై కేఈ కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్రభాకర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని త‌పిస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియ‌మిం చారు. కొన్ని రోజుల కింద‌ట […]

తెలంగాణలో 30 సీట్లపై టీడీపీ ఆశలు..ఛాన్స్ ఉందా?

ఒకప్పుడు తెలంగాణ అంటే టీడీపీకి కంచుకోట అన్నట్లు ఉండేది. అక్కడ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది..కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ బాగానే సీట్లు తెచ్చుకుంది. 15 సీట్లు టీడీపీ గెలిచింది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీని గట్టిగా దెబ్బతీశారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో..టీడీపీ పతన దశకు వచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని..కేవలం 2 […]

బొబ్బిలిలో సైకిల్ జోరు..30 ఏళ్ల తర్వాత ఛాన్స్.!

ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014 వరకు అక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా గెలిచిన సందర్భాలు తక్కువ. 1983, 1985, 1994 ఎన్నికల్లోనే టీడీపీ అక్కడ గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టీడీపీ గెలవలేదు. 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక ఎప్పుడో 1994లో గెలిచిన టీడీపీకి మళ్ళీ 2024 […]

బాలయ్యతో పవన్..అసలు గేమ్ మొదలైందా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళుతున్నాయి. పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు గాని..చంద్రబాబు-పవన్ మాత్రం పరోక్షంగా పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఈ పొత్తు అంశాన్ని ఎన్నికల ముందే తేలుస్తారని తెలుస్తోంది. అంటే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే బాబు వెళ్ళి పవన్‌ని […]

టీపీసీసీ మార్పు..రేవంత్‌కు ఎసరు..దిగ్విజయ్ తేల్చేశారు.!

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి…కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలపై ఫైట్ చేయడం, విమర్శలు చేయడం చేస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం మారిపోయింది. పైగా ఇటీవల పి‌సి‌సి పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ నడిచింది. సీనియర్లని పట్టించుకోకుండా పదవులని భర్తీ చేశారని, టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఎక్కువ ఇచ్చారని, […]

జనసేనతో పొత్తు..తెనాలి సీటు నాదెండ్లకే..ఆలపాటి క్లారిటీ.!

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై కొంతమంది తెలుగు తమ్ముళ్ళకు నిదానంగా క్లారిటీ వస్తుంది. పొత్తు ఉంటేనే గట్టెక్కుతామనే భావన..అటు టీడీపీలోగానీ, ఇటు జనసేనలో గాని ఉందని చెప్పవచ్చు. పొత్తు లేకపోతే ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీకే లబ్ది జరిగేలా ఉంది. అందుకే పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అంటున్నారు. ఇటు చంద్రబాబు కలిసి పనిచేద్దామని అంటున్నారు. మొత్తానికి అధికారికంగా పొత్తు విషయం క్లారిటీ లేదు గాని..అనధికారంగా చంద్రబాబు-పవన్ కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారని అర్ధమవుతుంది. […]

ఎలమంచిలిలో ట్విస్ట్..సీటు వాళ్ళకే ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే.!

వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు స్వతహాగానే సీటుపై ఆశలు వదులుకుంటున్నారు. ఎందుకంటే వారిపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయం అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే సీటు విషయంలో ఇప్పుడు కొత్త మెలికలు పెడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా..అదే తరహాలో సీటు విషయంలో కొత్త మెలిక పెడుతున్నారు. ప్రస్తుతం ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజుపై ప్రజా వ్యతిరేకత […]

బిగ్ డౌట్‌: ఈ టాప్ లీడ‌ర్లు వైసీపీలో ఉన్నారా… లేరా… !

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామ‌ని కొంద‌రు నాయ‌కులు అంటున్నా వాస్త‌వంగా చూస్తే అస‌లు వాళ్లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహలు క‌లుగుతున్నాయి. రీసెంట్‌గా మాజీ మంత్రి, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నాన‌ని చెబుతున్నారు. అయితే ఆయ‌న జ‌గ‌న్ పై విమర్శ‌లు చేశాక ఆ పార్టీ నేత‌లు ఎవ్వ‌రూ కూడా ఆయ‌న మా పార్టీ నాయ‌కుడే అని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. అయితే డీఎల్ మాత్రం తాను […]