కందుకూరుకు బాబు..టీడీపీ సీటు తేలుతుందా?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక బాబు ఎక్కడకు వెళ్ళితే అక్కడ జనం భారీ ఎత్తున వస్తున్నారు. రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అంతకముందు బాదుడేబాదుడు కార్యక్రమం కావచ్చు. ఇప్పుడు ఇదేం ఖర్మ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో బాబు రోడ్ షోలకు పెద్ద […]

గుడివాడలో రగిలిన చిచ్చు..రావి వర్సెస్ కొడాలి వర్గం.!

గుడివాడలో మరోసారి రచ్చ లేచింది…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇప్పటివరకు రాజకీయ పరమైన గొడవలే ఉంటే..ఇప్పుడు ఏకంగా కొట్టుకునేవరకు వెళ్ళిపోయారు. డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం చేయడానికి టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు సిద్ధమయ్యారు..కానీ ఆ కార్యమాన్ని చేయొద్దని కొడాలి నాని అనుచరుడు కాళీ..రావికి ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిసింది. ఆ వెంటనే రావి పోలీసులకు ఫిర్యాదు చేసి..పార్టీ ఆఫీసుకు రాగా, కొడాలి అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో వచ్చి […]

పార్వతీపురం టీడీపీలో సీటు పోరు..చిరంజీవులకు ఎసరు!

గిరిజన ప్రాంతాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదనే సంగతి తెలిసిందే..మొదట నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్న సీట్లలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది..ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉంది. కాంగ్రెస్ దెబ్బతినడంతో ఆ ప్లేస్ లోకి వైసీపీకి వచ్చింది. గిరిజన ప్రజలు వైసీపీని ఆదరిస్తూ వస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్నీ స్థానాల్లో వైసీపీకి పట్టు ఉంది. అయితే టీడీపీకి కొద్దో గొప్పో పట్టు ఉన్న స్థానం పార్వతీపురం…ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో 2014 […]

ఈ స్ట‌యిల్ మారాలేమో బాబూ…!

రాజ‌కీయంగా నాయ‌కుల‌కు ఒక ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత‌.. కొంత ఇబ్బంది వ‌స్తుంది. అదేంటంటే మాస్ మ‌హారాజు మాదిరిగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక పోవ‌డం. అంతేకాదు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకో వ‌డం. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును ప‌రిశీలిస్తే.. ఈ రెండు స‌మ‌స్య‌లు ఆయ‌న ప్ర‌సంగాల్లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌జ‌లు ఆయ‌న స‌భ‌ల‌కు వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌సంగాల్లో ఒకింత అగ్ర‌సివ్ నెస్ క‌నిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]

మీడియాతో రాజకీయం..ఎవరి కాన్సెప్ట్ వారిది..!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మీడియానే రాజకీయాలు చేస్తుందా? అనే పరిస్తితి. అంటే ఆ స్థాయిలో మీడియా జోక్యం ఉంది..పైగా పార్టీల వారీగా మీడియా విడిపోయింది. పిల్లలని అడిగిన సైతం ఏ మీడియా..ఏ పార్టీదో చెప్పేస్తారు. అంటే ఆ స్థాయిలో మీడియా కొన్ని పార్టీలకు భజన సంస్థలుగా మారిపోయాయి. ఏపీలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తోన్న చంద్ర‌బాబు… మ‌ళ్లీ బిగ్ రాంగ్ స్టెప్‌…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న రాజ‌కీయాలు చిత్రంగా క‌నిపిస్తున్నాయి. త‌న‌ను న‌మ్మాల‌ని ఆయ‌న చెప్ప‌డం లేదు కానీ.. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని అంటున్నారు. అది కూడా తెలంగాణ‌లోనే. అది కూడా.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న చెప్ప‌డం లేదు. పార్టీ నుంచి వెళ్లిన వారు చాలా మంది ఉన్నార‌ని.. వారంతా తిరిగి వ‌చ్చేయాల‌ని ఆయ‌న పిలుపుఇచ్చారు. ఇది మంచిదే అయినా.. ఎంత మంది తిరిగి వ‌స్తారు? వ‌చ్చినా..చంద్ర‌బాబును ఎందుకు న‌మ్ముతారు? ఎలా న‌మ్ముతారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌. […]

టీడీపీ కండువాతో రాము..సీటు నాదే అంటున్న రావి..!

గుడివాడ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి..అందులోనూ టీడీపీలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు చాలా కసితో ఉన్నాయి. ఆయన్ని ఓడించి తీరాలని పనిచేస్తున్నాయి. బలమైన నాయకుడుని ముందు పెట్టి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే టీడీపీలో సీటు కోసం పోటీ పెరిగిపోతుంది.ఇప్పటికీ గుడివాడలో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతానికి ఇంచార్జ్‌గా  రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో […]

పుష్పశ్రీకి భారీ షాక్..కురుపాం టీడీపీకి దక్కేనా!

ఏజెన్సీ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని విషయం తెలిసిందే. ఏజెన్సీల్లో మొదట కాంగ్రెస్ హవా నడిచేది.ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. ఇక ఏజెన్సీలో కీలకంగా ఉన్న కురుపాం స్థానంలో కూడా గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. ఇక్కడ టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పుష్పశ్రీ వాణి గెలుస్తూ వచ్చారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక గిరిజన శాఖ […]

విజయనగరంలో బాబు సత్తా..టీడీపీకి అవే ప్లస్.!

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే..ప్రతి జిల్లాలోనూ టీడీపీకి దెబ్బతగిలింది. కొన్ని జిల్లాల్లో ఇంకా దారుణమైన ఫలితాలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో దారుణంగా ఓడి ఒక్క సీటు కూడా గెలవలేదు. మామూలుగా సీమ బెల్టులో టీడీపీకి దారుణ ఓటమి వచ్చిన పార్టీ శ్రేణులు తీసుకున్నాయి గాని..పట్టున్న విజయనగరంలో కూడా ఒక్క సీటు కూడా తెచ్చుకోకపోవడం మింగుడు పడని విషయం. […]