వైసీపీకి భారీ డ్యామేజ్..అన్నీ సీట్లలో పోరు..!

రాజకీయాల్లో ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు ఉండటం సహజమే..అధికారం కోసం కావచ్చు..ఇతర పెత్తనం కోసం కావచ్చు..లేదా సీటు కోసం కావచ్చు…ఏదైనా కారణమైన అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు అనేది ఉంటుంది. కానీ ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో ఉంది. ఎక్కడక్కడ నేతల మధ్య పడని పరిస్తితి. ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు నేతలు పనిచేస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఎంత సర్దిచెప్పిన కొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పు మాదిరిగా రచ్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ గొడవలు ఏదో కొన్ని స్థానాల్లోనే ఉన్నాయనుకుంటే పొరపాటే…వైసీపీలో మెజారిటీ స్థానాల్లో ఆధిపత్య పోరు ఉందట. వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు..టి‌డి‌పి-జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని కలుపుకుంటే 156 స్థానాలు ఇందులో దాదాపు 130 స్థానాల వరకు వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తుందట. అంతర్గత విభేదాలు, వర్గ పోరు తారస్థాయిలో జరుగుతుందట.

అయితే ఇలా పోరు జరగడం వైసీపీకి పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల సీన్ మారిపోతుంది. నేతలు బహిరంగంగా వీధికెక్కి మరీ గొడవలు పడుతున్నారు. దీని వల్ల క్యాడర్ లో కన్ఫ్యూజన్ ఉంది. పైగా సీట్ల విషయంలో ఈ రచ్చ ఎక్కువ కనిపిస్తుంది. ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. దీని వల్ల పార్టీకి భారీ డ్యామేజ్ జరగడం ఖాయమని తెలుస్తోంది. ఇదే సీన్ ఎన్నికల వరకు నడిస్తే…వైసీపీ భారీ స్థాయిలో సీట్లు కోల్పోవడం గ్యారెంటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.