ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. దట్ ఇస్ తారక్..!

గత కొన్ని రోజులుగా నందమూరి అభిమానులు ఎంతో ఆస్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్న తారక్.. తన తర్వాత సినిమాను స్టార్ట్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. గత సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఈ సినిమా అప్డేట్ ఇచ్చిన కొరటాల మళ్లీ ఆ తర్వాత ఈ సినిమా గురించి పట్టించుకోవటమే మానేశాడు.

ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొరటాలను టార్గెట్ చేస్తూ కామెంట్లు కూడా చేశారు. ఇక ఎట్టకేలకు న్యూ ఇయర్ కానుకగా ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసుకునే అప్డేట్ అందించాడు కొరటాల. ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతుందని.. ఇక ఈ సినిమాను 2023 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే ఈ నెల 4 తారీఖు నుంచి ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా ప్రారంభం కావలసి ఉంది.

రీసెంట్గా ఎన్టీఆర్ సోదరుడు తారకరత్నకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన సోదరుడు ఆరోగ్యం బాగోలేని కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతున్నట్లు పలు వార్తలు వైరల్ గా మారాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఆ వార్తలు నిజమే అని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెల 4వ తేదీన ఎంతో గ్రాండ్ గా ప్రారంభించడానికి సన్నాహాలు చేశారట.

అయితే ఈ సందర్భంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నీ ఏకంగా ఈనెల 21వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా ఎన్టీఆర్ 30 వ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌ను త‌న‌ ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

Share post:

Latest