రికార్డు స్థాయిలో ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్.. బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్షన్లో `సలార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక‌పోతే హై బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ చిత్రాల‌కు ప్ర‌భాస్ వంద కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ను ఛార్జ్ చేస్తున్నారు. ఆయ‌న ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రుగుతోంది. అలాగే టాక్ ఎలా ఉన్నా తొలి రోజు క‌ళ్లు చేదిరే రీతిలో ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా తన పంథాని ప్రభాస్ మార్చుకున్నారని.. వంద కోట్లకు మించి రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం చేస్తున్న మూడు చిత్రాల‌తో త‌ర్వాత ప్ర‌భాస్ `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో కలిసి `స్పిరిట్` మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ రెండు చిత్రాల‌కు ప్ర‌భాస్ ఏకంగా రూ. 150 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకోబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి రికార్డు స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తూ బాలీవుడ్ హీరోలు సైతం త‌న ముందే దిగ‌దుడుపే అని ప్ర‌భాస్ నిరూపించ‌బోతున్నాడు.