త‌మ్ముళ్ల మ‌ధ్య గొడ‌వ పెట్టిన చంద్ర‌బాబు… త‌న్నుకుంటున్నారుగా…!

తాంబూలాలిచ్చేశాను.. త‌న్నుకు చావండి! అని క‌న్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నేత‌లు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీల‌క‌మైన డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబం ధించి.. నాయ‌కులు త‌న్నుకులాడుతున్నారు. డోన్ నియోజ‌క‌వ‌ర్గంపై కేఈ కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్రభాకర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని త‌పిస్తున్నారు.

అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియ‌మిం చారు. కొన్ని రోజుల కింద‌ట క‌ర్నూలులో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు సుబ్బారెడ్డిని త‌న‌వెంటే పెట్టుకుని.. ప‌ర్య‌టించారు. ఈ ప‌రిణామం.. కేఈ కుటుంబానికి స‌హజంగానే ఆగ్ర‌హం తెప్పించింది. త‌మ కుటుంబానికి ప‌త్తికొండ‌, డోన్‌రెండు టికెట్ కావాల‌ని.. చంద్ర‌బాబును ఎప్ప‌టి నుంచో కోరుతున్నామ‌ని.. అయినా.. త‌మ కు అన్యాయం చేశార‌ని.. ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు.

అయితే.. కేఈ ప్ర‌భాక‌ర్‌కు టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అన్న‌ది చంద్ర‌బాబు ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు. కానీ, ఇంచార్జ్‌గా మాత్రం ఇక్క‌డ ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డిని నియ‌మించ‌డంతో దాదాపు కేఈ ప్ర‌భాక‌ర్‌ను ప‌క్క‌న పెట్టార‌నే చ‌ర్చ సాగుతోంది. దీనికి కార‌ణం కూడా ఉంది. కేఈ టీడీపీ నేత‌ల‌ను క‌లుపుకొని పోవ‌డం లేద‌ని.. సొంత రాజ‌కీయాలు చేస్తున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేఈని త‌ప్పిస్తున్నార‌ని అంటున్నారు.

ఏపీ మంత్రిపై టీడీపీ నుంచి పోటీచేసేది నేనే అంటున్న ఇంఛార్జ్.. మరి సీనియర్  నేత సంగతేంటి! - dhone tdp incharge dharmavaram subba reddy interesting  comments - Samayam Telugu

ధర్మవరం సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు నిర్నయాన్ని నేరుగా తప్పుపట్టారు కేఈ ప్రభాకర్. ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి వెళ్ళాలంటే రాజకీయంగా అనుభవం ఉండాలని అన్నారు. కనీసం వార్డ్ మెంబర్గా కూడా అనుభవం లేని వ్యక్తి ని ఎలా నిల‌బెడ‌తార‌ని ప్ర‌శ్నించ‌డం.. రాజ‌కీయంగా సొంత పార్టీలోనే క‌ల‌క‌లం రేపుతోంది. మొత్తంగా డోన్‌లో ఈ ప‌రిణామం.. త‌మ్ముళ్ల మ‌ధ్య ర‌గ‌డ‌కు దారితీయ‌డం.. గ‌మ‌నార్హం.