ఎవరు ఊహించని స‌ర్‌ఫ్రైజ్‌తో చిరు, బాల‌య్య‌… ఫ్యాన్స్‌కు సంక్రాంతిని మించిన పండుగ‌..!

రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో త‌లపడనున్నారు. వీరిద్దరి మధ్య సంక్రాంతి వార్ అంటే అభిమానులకి పండగే. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12న ముందుగా థియేటర్లో సందడి చేయబోతున్నాడు. తర్వాత రోజు జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు.

మన టాలీవుడ్ చరిత్రలో ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాలను ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక్కరోజు గ్యాప్ లో విడుదల అవటం ఇది ఎప్పుడు జరగలేదు. ఇదే తొలిసారి. అయితే చిరంజీవి- బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ ఇప్పటిది కాదు. నాలుగు దశాబ్దాల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ వార్‌ జరుగుతూనే ఉంది. అందులో కొన్నిసార్లు చిరంజీవి పై చేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు బాలయ్య పై చేయి సాధించాడు.

అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఈ ఇద్దరి అభిమానులు మధ్య‌ కూడా భారీ స్థాయిలో పోటీ ఉండేది.
ఇప్పుడు ఎవరు ఊహించని సర్ప్రైజ్ తో మైత్రి మూవీ మేకర్స్ బాలయ్య వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నారని తెలుస్తుంది. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు బాలయ్య అతిథిగా పిలిచే ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమాల ప్రమోషన్ లో భాగంగా ఈ అగ్ర హీరోలతో ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ క్రేజీ ఐడియా మాత్రం నిజమైతే ఇది అభిమానులకు సంక్రాంతి మించిన పెద్ద పండుగ అవుతుంది అని చెప్పవచ్చు.. ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.