ఎన్టీఆర్ ఆ సీక్రెట్లు బ‌య‌ట పెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌డా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవ్వనున్నాడు. ఇప్పటికే తన 30వ సినిమా అని స్టార్ట్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించినన తారక్.. ఆ సినిమా షూటింగ్ వచ్చే 2023 వ సంవత్సరం నుంచి షూటింగ్‌లో బిజీ అవ‌నున్నాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ తన కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇటీవ‌ల‌ ఎన్టీఆర్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నాడు.. రీసెంట్‌గా వెకేషన్లో తన భార్యా ప్రణితితో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటో కూడా అక్కడ ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసిన ఫోటో అని సమాచారం. అయితే మహేష్, బన్నీ, చరణ్ ఫ్యామిలీతో వెకేషన్ కి వెళితే అక్కడ వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.

Jr NTR love picture with wife goes viral. - Filmify.in

అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొరటాలతో చేయబోయే తన 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను వచ్చే సంక్రాంతి కానుకగా అభిమానులకు రివిల్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ హీరోయిన్‌గా సెట్ అయినట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమా కోసం జాన్వి ఏకంగా నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంద‌ట‌.

ఎన్టీఆర్ -జాన్వి జోడి బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. ఎన్టీఆర్ తో పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే కథతో ప్రశాంత్- ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు.