శృతిహాసన్ కు వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకుంటుందా..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉపయోగపడుతుందో ఎప్పుడు డౌన్ అవుతుందో చెప్పలేము అని చెప్పవచ్చు. క్రేజ్ మొదలైనప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ లాంటిదని చెప్పవచ్చు. కొంతమంది అనుకున్నంత క్రేజ్ ముందే వచ్చేస్తూ ఉంటుంది.మరి కొంతమందికి ఆ సమయం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. మరి కొంతమంది మాత్రం క్రేజ్ నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేక పక్క దావపడుతూ ఉంటారు.

Shruti Haasan affair list

అలా ఇప్పుడు తాజాగా హీరోయిన్స్ శృతిహాసన్ కూడా ఇదే పని చేస్తుంది.తెలుగులో అనగనగా ఒక ధీరుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత హిందీ, తమిళ్ భాషలలో నటించి మంచి పేరు సంపాదించింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్ అని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ్ ,తెలుగు ,హిందీ భాషలలో బాగానే నటించినప్పటికీ తెలుగులో గబ్బర్ సింగ్ బలుపు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకుంది. అలా స్టార్ డం అని కూడా సొంతం చేసుకుంది.కానీ 2017లో సైడ్ అయిపోవడం వల్ల ఈమె అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

లండన్ బేస్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేటపట్టాలేసుకొని తిరుగుతూ కెరీర్ ని పక్కన కు పెట్టేసింది. దీంతో శృతిహాసన్ ఒక్కసారిగా మళ్లీ జీరో కు వెళ్ళిపోయింది. తన కెరియర్ ప్రారంభించిన వాళ్లంతా స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటే శృతిహాసన్ మల్లి అవకాశాల కోసం వెతుక్కోవలసి వచ్చింది. అలాంటి సమయంలోనే రవితేజ తో కలిసి క్రాక్ సినిమాలో నటించి తన అదృష్టాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే వకీల్ సాబ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.ఇప్పుడు చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తోంది. మరి ఈ క్రేజ్ ను ఇమే కంటిన్యూ చేస్తుందా మళ్ళీ గతంలో లాగా సైడ్ అవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.