బాక్సాఫీస్ వ‌ద్ద `ధ‌మాకా` మాస్ బీభ‌త్సం.. తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి ఫ్లాప్స్ అనంతరం మాస్‌ మహారాజ్‌ రవితేజ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల, రావు రమేష్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. భారీ అంచ‌నాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా మాస్ బీభ‌త్సం సృష్టిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్ల షేర్‌, రూ. 7.60 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 5.10 కోట్ల షేర్‌, రూ. 9.00 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా ధ‌మాకా తొలి రోజు టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.10 కోట్లు
సీడెడ్: 66 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 56 ల‌క్ష‌లు
తూర్పు: 24 ల‌క్ష‌లు
పశ్చిమ: 16 ల‌క్ష‌లు
గుంటూరు: 40 ల‌క్ష‌లు
కృష్ణ: 25 ల‌క్ష‌లు
నెల్లూరు: 13 ల‌క్ష‌లు
———————————————-
ఏపీ+తెలంగాణ‌= 4.50 కోట్లు(7.60కోట్లు~ గ్రాస్)
———————————————-

క‌ర్ణాట‌క+రెస్టాఫ్ ఇండియా : 45 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ : 15 ల‌క్ష‌లు
—————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 5.10 కోట్లు(9.00కోట్లు~ గ్రాస్)
—————————————–

కాగా, రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే తొలి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ.13.90 కోట్ల రేంజ్ లో షేర్‌ను వ‌సూల్ చేయాల్సి ఉంటుంది.