`18 పేజెస్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. నిఖిల్ కు `ధమాకా` దెబ్బ త‌గిలిందిగా!

`కార్తికేయ 2` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ హీరో నిఖిల్.. తాజాగా `18 పేజస్‌` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ ఈ సినిమాకు కథ‌ స్క్రీన్ ప్లే అందించారు.

ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ పోటీగా రవితేజ ధమాకా దిగడంతో తొలిరోజు కలెక్షన్ల పరంగా నిఖిల్ కు గ‌ట్టి దెబ్బే తగిలింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది భావించారు. కానీ మొత్తం మీద రూ. 1.20 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా 18 పేజెస్ టోట‌ల్ వ‌సూళ్ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం – 1.05 కోట్లు
సీడెడ్ – 0.25 కోట్లు
ఆంధ్రా – 1.05 కోట్లు
————————————
ఏపీ+తెలంగాణ‌=2.35కోట్లు~గ్రాస్(1.20కోట్లు~ షేర్ )
————————————

క‌ర్ణాట‌క‌ – 30 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌ – 80 ల‌క్ష‌లు
————————————
వ‌ర‌ల్డ్ వైడ్ = 3.45కోట్లు~గ్రాస్(1.75కోట్లు~ షేర్ )
————————————

కాగా, రూ. 12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినఈ సినిమా.. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 10.75 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.