ఎన్టీఆర్‌పై పడిన తమ్ముళ్ళు..ఇదేం ట్విస్ట్.!

రాష్ట్రంలో ఏం జరిగిన..ఎలాంటి పరిస్తితుల్లోనైనా తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఎన్టీఆర్‌ని స్పందించాలని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. అసలు ఆయన రాజకీయాల్లో లేరు..సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన స్పందించాలని అడుగుతుంటారు. అయితే భువనేశ్వరిని అవమానించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నప్పుడు ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్సార్ అని పేరు పెట్టినప్పుడు న్యూట్రల్ గా స్పందించారు. అయితే ఇప్పుడు బాబు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించాలని తమ్ముళ్ళు డిమాండ్ […]

నో సింపతీ..తమ్ముళ్ళ ఆవేదన.!

చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అది ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉందనగా అరెస్ట్ అయ్యారు. కేవలం జగన్ ప్రభుత్వం కక్ష కట్టి బాబుని అరెస్ట్ చేసిందని తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఈ కేసులో ప్రేమ్ చందర్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి లాంటి వారు ఉన్నా  సరే, వారిని వదిలేసి..కేవలం ఏ 37 అని చెప్పి బాబుని అరెస్ట్ చేశారని, పైగా బాబు డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు చూపమంటే పోలీసులు విచారణ చేస్తున్నారని తప్పించుకుంటున్నారని, దీని […]

బీజేపీకి పవన్‌ క్లారిటీ..తేల్చుకోవాల్సిందే.!

చంద్రబాబుకు బి‌జే‌పి మద్ధతు ఉందా? అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. బి‌జే‌పి సపోర్ట్ కోసం బాబు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చూశారు. అయితే బి‌జే‌పి ఎక్కడ కూడా బాబుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇటు బి‌జే‌పితో పొత్తులో ఉన్న పవన్ ద్వారా కూడా పొత్తు కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బి‌జే‌పి మద్ధతు లేకపోవడంతోనే బాబు […]

నెక్స్ట్ లోకేష్..రెడీ అయినట్లే.?

స్కిల్ డెవలప్మెంట్ కేసు లో టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని జగన్ ప్రభుత్వం ఇరికించిందని టి‌డి‌పి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. కానీ బాబు అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. అదే సమయంలో తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని, కోర్టు రిమాండ్ విధించిందని, లేదంటే రిమాండ్ విధించేది కాదని వైసీపీ వాళ్ళు […]

అటు జనసేన-ఇటు బీజేపీ..టీడీపీకి టెన్షన్ అదే.!

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఎక్కువ సాగుతుంది. అది కుదరకపోతే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు అనేది టి‌డి‌పికి కావాలి. లేదంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీని నిలువరించడం అంత ఈజీ కాదు. అందుకే చంద్రబాబు..బి‌జే‌పితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో బి‌జే‌పి భారీగానే డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు […]

అనంతలో బాబుకు ఎదురుదెబ్బ..వైసీపీకే లీడ్.!

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే…ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. టి‌డి‌పి కంచుకోటలని వైసీపీ బ్రేక్ చేసి..అనంతలో అద్భుతమైన విజయాలు అందుకుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే ఎలాగోలా అనంతపై పట్టు సాధించాలని టి‌డి‌పి ప్రయత్నిస్తూనే ఉంది. టి‌డి‌పి నేతలు కష్టపడుతున్నారు. కానీ అనుకున్న మేర టి‌డి‌పికి బలం పెరగలేదు. తాజాగా కూడా బాబు అనంత టూర్‌కు […]

ఎలమంచిలి జనసేనకే..కానీ అదొక్కటే డౌట్.!

టీడీపీ-జనసేన పొత్తుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ అనధికారికంగా రెండు పార్టీల శ్రేణులు పొత్తు ఫిక్స్ అయిపోయాయి. దాదాపు పొత్తు ఖాయమైనట్లే…ఇంకా ఆ రెండు పార్టీలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే. టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో సీట్ల గురించి చర్చ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇదే క్రమంలో విశాఖలో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల […]

పశ్చిమలో ఫ్లాప్..కానీ లోకేష్‌కు వైసీపీ ప్లస్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే పశ్చిమ పాదయాత్రలో అంత జోష్ లేదు. ఏదో చప్పగానే పాదయాత్ర సాగుతుంది. ఇంకా చెప్పాలంటే పశ్చిమలో పాదయాత్ర ఫ్లాప్ అయిందనే చెప్పాలి. అలా ఫ్లాప్ అయిన పాదయాత్ర అనవసరంగా వైసీపీ పైకి లేపిందని చెప్పవచ్చు. పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళతో, కర్రలతో దాడులు చేయడం..కొందరు టి‌డి‌పి శ్రేణులకు గాయాలు అవ్వడం, అటు టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే […]

35  సీట్లలో ఫిక్స్..కాంగ్రెస్‌కు అవే తలనొప్పి.!

తెలంగాణలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు 1000 మందిపైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారట. అంటే సీనియర్ నేతలు […]