పశ్చిమలో ఫ్లాప్..కానీ లోకేష్‌కు వైసీపీ ప్లస్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే పశ్చిమ పాదయాత్రలో అంత జోష్ లేదు. ఏదో చప్పగానే పాదయాత్ర సాగుతుంది. ఇంకా చెప్పాలంటే పశ్చిమలో పాదయాత్ర ఫ్లాప్ అయిందనే చెప్పాలి. అలా ఫ్లాప్ అయిన పాదయాత్ర అనవసరంగా వైసీపీ పైకి లేపిందని చెప్పవచ్చు.

పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళతో, కర్రలతో దాడులు చేయడం..కొందరు టి‌డి‌పి శ్రేణులకు గాయాలు అవ్వడం, అటు టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఛాతీపై దెబ్బ తగలడం జరిగాయి. అయితే వైసీపీ శ్రేణుల దాడులని టి‌డి‌పి వాళ్ళు కూడా తిప్పికొట్టారు. కానీ ట్విస్ట్ ఏంటంటే..పోలీసులు టి‌డి‌పి వాళ్లపైనే కేసులు పెట్టారు. దీంతో అనూహ్యంగా మళ్ళీ పాదయాత్ర హైలైట్ అయింది. అటు లోకేష్‌కు నోటీసులు ఇచ్చారు. అంటే దాడులు చేసింది వైసీపీ శ్రేణులు..కానీ కేసులు టి‌డి‌పి వాళ్లపై అన్నట్లు ఉంది. ఇలా చేయడం వల్ల పరోక్షంగా పాదయాత్రకు ప్లస్ చేసినట్లు ఉంది.

ఎందుకంటే గత కొన్ని రోజులుగా పాదయాత్ర గురించి చర్చ లేదు. కృష్ణా జిల్లా గన్నవరం సభ వరకు పాదయాత్ర  విజయవంతంగానే సాగింది. ఆ తర్వాత నుంచి చప్పుడు లేదు. అలాంటప్పుడు వైసీపీ శ్రేణులు దాడులు చేసి పాదయాత్రని హైలైట్ చేశారని విశ్లేషకులు అంటున్నారు. అలా వదిలేసిన పెద్దగా ప్రజలు పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు పాదయాత్రలో ఏం జరుగుతుందా? అనే ఆతృత్ర ఉందని అంటున్నారు. మొత్తానికి లోకేష్ పాదయాత్రకు వైసీపీ ప్లస్ అయిందని చెబుతున్నారు.