రామ్ స్కంద రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్‌… అక్క‌డ ఒక రోజు ముందే షో…!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మార్క్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీ స్కంద తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక వీరిద్దరి ఎనర్జిటిక్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆడియన్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా రీసెంట్గా కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 28 నా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఓవర్సీస్ లో సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. వర్ణిక విజువల్స్ ఓవర్సీస్ లో స్కంద సినిమాను రిలీజ్ చేస్తారు. శ్రీ లీలా హీరోయిన్గా నటించిన‌ ఈ సినిమాకు ఎస్ ఎస్ థ‌మన్ సంగీతం అందించాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజ‌ర్, సాంగ్స్‌ రిలీజై ప్రేక్ష‌కుల‌ను ఆక‌టుకున్నాయి. ఈ ప్రమోషన్ ఈవెంట్‌లో ఇటీవ‌ల బాల‌య్య సంద‌డి చేశాడు. దీంతో ఈ సినిమాపై మ‌రింత హైప్ పెరిగిపోయింది.