జ‌వాన్ దెబ్బ‌తో ప‌ఠాన్ రికార్డులు తునాతున‌క‌లు… షారుక్ ఏం అరాచ‌కం సామీ…!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన జవాన్ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రిలీజ్ అయింది. నయనతార హీరోయిన్‌గా ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ పాఠాన్ త‌ర్వాత షారుఖ్ ఖాన్ నటించిన రెండవ సినిమా. గత శుక్రవారం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఆ తర్వాత నుంచి సినిమా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్‌ల‌ను చేసుకుంది.

ఇప్పటివరకు స్టార్టింగ్‌డే నుంచి 5,56, 000 టికెట్లను అమ్మడం ద్వారా.. నేషనల్ అనగా పివిఆర్, ఐనాక్స్, మరియు సినీ పోలీస్ – పిఐసిలో అత్యధిక అడ్వాన్స్ బుక్కింగ్‌లను సాధించి రికార్డులను పఠాన్ సృష్టించింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి జవాన్ పైన ఉండడంతో అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ పఠాన్‌ని చాలా ఈజీగా బీట్ చేసింది. కానీ జవాన్ కు పఠాన్ కంటే తక్కువ షోస్ వచ్చాయి. ఎందుకంటే సినిమా రెన్ టైమ్‌ చాలా ఎక్కువ కావ‌టం కార‌ణ‌మ‌ట‌.

అయితే జవాన్ జాతీయ చైన్‌లలో పటాన్ బుకింగ్లను స్వల్ప మార్జిన్‌తో దాటాడు. ఇది టాలీవుడ్ సినిమాకి అత్యధికం కాగా.. బాహుబలి 2 హిందీ వర్షన్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. దీంతో బాక్సాఫీస్ వద్ద జవాన్ భారీ విధ్వంసం సృష్టిస్తుందని చెప్పవచ్చు. సినిమా టాక్, రివ్యూలు బట్టి ఓపెనింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో కూడా జవాన్ సెన్సేషనల్ ఓపెనింగ్స్‌కి రెడీగా ఉంది.