రిలీజ్‌కు ముందే రూ.50 కోట్లు వసూళ్లు చేసిన జవాన్..!!

రిలీజ్ తర్వాత 50 కోట్ల భారీ వసూలు కలెక్షన్ చేసిన సినిమాలను చాలానే చూశాం. అయితే విడుదలకు ముందే రూ.50 కోట్లు వసూలు రాబ‌ట్టిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతం దీనికి సమాధానం జవాన్ సినిమా అని చెబుతున్నారు. షారుక్ నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే రూ.50 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టింది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో జవాన్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌కి ముందే రూ51.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇదంతా పఠాన్ సినిమాతో వచ్చిన ఊపు. వరుసగా ప్లాపులు వ‌చ్చిన పఠాన్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకొని బౌన్స్‌ బ్యాక్ అయ్యాడు షారుక్‌. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కావడంతో జవాన్ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలో జవాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే రూ.32 కోట్ల 47 లక్షలు వచ్చాయట. మరో 60 లక్షల రూపాయలు కలెక్షన్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 2.25 మిలియన్ డాలర్లు వసూలు వచ్చాయి.

ఈ క్రమంలో పఠాన్‌ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను జవాన్ అదిగమించినట్లు తెలుస్తుంది. జవాన్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌ల‌లో 4,57,230 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సంఖ్యలో మరో 40,000 వరకు పెరిగే అవకాశం కూడా ఉందట. అయితే మల్టీప్లెక్స్ టికెట్ సేల్స్ లో జవాన్ తన జోరు చూపించలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్ లో బాహుబలి 2 సినిమా 6,50,000 అడ్వాన్స్ టికెట్ అమ్మకాలతో టాప్లో ఉంది. 2వ‌ స్థానంలో పఠాన్, 3వ‌ స్థానంలో కేజీఎఫ్ 2 ఉండడంతో ప్రస్తుతం జవాన్ 4వ స్థానంలో ఉంది.