ఎలమంచిలి జనసేనకే..కానీ అదొక్కటే డౌట్.!

టీడీపీ-జనసేన పొత్తుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ అనధికారికంగా రెండు పార్టీల శ్రేణులు పొత్తు ఫిక్స్ అయిపోయాయి. దాదాపు పొత్తు ఖాయమైనట్లే…ఇంకా ఆ రెండు పార్టీలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే. టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో సీట్ల గురించి చర్చ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది.

ఇదే క్రమంలో విశాఖలో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల విషయంలో రచ్చ నడుస్తోంది. విశాఖలో గత ఎన్నికల్లో జనసేన రెండోస్థానంలో నిలిచిన సీటు గాజువాక..అక్కడ పవన్ పోటీ చేయడం వల్ల రెండోస్థానం వచ్చింది. ఇప్పుడు పొత్తులో ఆ సీటు జనసేన అడుగుతుంది. పవన్ పోటీ చేస్తే వదులుకోవడానికి టి‌డి‌పి రెడీ కానీ..వేరే నేత పోటీ చేస్తే వదులుకునే ఛాన్స్ లేదు. ఇక భీమిలిలో టి‌డి‌పికి బలం ఎక్కువ. అటు జనసేనకు 30 వేల ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ సీటుపై రచ్చ ఉంది. అలాగే ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి సీట్ల విషయంలో కూడా కాస్త రెండు పార్టీల మధ్య చర్చ ఎక్కువ ఉంది.

అయితే ఎలమంచిలి సీటు టి‌డి‌పి..జనసేన కోసం త్యాగం చేయవచ్చు. కానీ పెందుర్తి కుదరదు. అక్కడ టి‌డి‌పి సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఆయన్ని కాదని జనసేనకు సీటు ఇవ్వడం జరిగే పని కాదు. ఇక అనకాపల్లి సీటు కూడా టి‌డి‌పి వదులుకునే ఛాన్స్ లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు తక్కువ. కాబట్టి ఈ సీటు టి‌డి‌పి వదులుకోదు.