ఫ్యామిలీతో కలిసి ఆ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.. మహేష్ బాబు (ట్వీట్)

టాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘ జవాన్ ‘. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 7) న హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు పెంచగా.. సౌత్ స్టార్స్ సైతం ‘ జవాన్ ‘ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాల వేదికగా స్పందించాడు.

ఈ మేరకు ” ఇది జవాన్ సమయం! షారుక్ ఖాన్ పవర్ మొత్తం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ టీమ్ కి అన్ని మార్కెట్లలో అల్,టైమ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కోరుకుంటున్నాను! కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని ఎదురుచూస్తున్నాను” అంటూ జవాన్ మూవీ టీంకు మహేష్ శుభాకాంక్షలు తెలిపాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ గా మారింది.