రోజా ఎవ‌రు..? స్టార్ బ్యూటి సంచ‌ల‌న కామెంట్లు వైర‌ల్‌..!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కంగనా బాలీవుడ్ లో ఫ్యాషన్ క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆమె సత్తా చాటుకుంది. ఇప్పుడు ఏవో వివాదాస్ప‌ద‌ కామెంట్స్ చేస్తూ న‌లు వివాదాల‌లో చిక్కుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్‌లో కంగనా చేసిన కామెంట్స్ తీవ్ర దుమ్మారానికి దారితీశాయి. బాలీవుడ్ గ్రీక్‌గార్డ్ గా పేరు సంపాదించిన‌ హృతిక్ రోషన్‌తో ఎఫైర్ విషయంలో కాంగన బోల్డ్‌ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తుంది. ఇందులో లారెన్స్ హీరోగా న‌టిస్తున్పాడు. సిప్టెంబర్ 15న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చెన్నైలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కంగనా మీడియాతో మాట్లాడుతూ కొన్ని సన్సేష‌న‌ల్‌ కామెంట్స్ చేసింది. ప్రముఖ టాలీవుడ్ యాక్టర్, ఏపీ ప్రభుత్వ పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా ఉన్న రోజాపై ఆమె స్పందించింది. ఆమె ఎవరో నాకు తెలియదని చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించేవారు రాజకీయాలకు రాకూడదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి గతంలో రోజా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా చెన్నైలో మీడియాతో మాట్లాడిన కంగనా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని తెలిపింది. వాస్తవానికి గత పార్లమెంటు ఎన్నికల్లో కంగనా పోటీకి ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రాకూడదని రోజా వ్యాఖ్యలు కంగనాకు మీడియా సభ్యులు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఆమె షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ రోజా ఎవరో నాకు తెలియదని.. అలాంటి వారు ఉన్నారనే విషయం నాకు తెలియదని.. ఇక ఆమె గురించి నేను ఏమి మాట్లాడతానని చెప్పుకొచ్చింది. తనకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తే వదులుకోనని కంగానా స్పష్టం చేసింది. దీంతో కంగాన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.