నో సింపతీ..తమ్ముళ్ళ ఆవేదన.!

చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అది ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉందనగా అరెస్ట్ అయ్యారు. కేవలం జగన్ ప్రభుత్వం కక్ష కట్టి బాబుని అరెస్ట్ చేసిందని తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఈ కేసులో ప్రేమ్ చందర్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి లాంటి వారు ఉన్నా  సరే, వారిని వదిలేసి..కేవలం ఏ 37 అని చెప్పి బాబుని అరెస్ట్ చేశారని, పైగా బాబు డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు చూపమంటే పోలీసులు విచారణ చేస్తున్నారని తప్పించుకుంటున్నారని, దీని బట్టి చూస్తే ఇది పూర్తిగా కక్షపూరితమైన అరెస్ట్ అని తమ్ముళ్ళు అంటున్నారు.

అలాగే అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేశారు. బంద్‌కు టి‌డి‌పికి మద్ధతుగా జనసేన, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, ఎం‌ఆర్‌పి‌ఎస్ లాంటి పార్టీలు మద్ధతు ఇచ్చాయి. ఇక బాబుకు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైల్లో బాబుకు ప్రాణహాని ఉందని, హౌస్ అరెస్ట్‌కు ఇవ్వాలని వాదిస్తున్నారు. అయితే ఇదంతా టి‌డి‌పి ఆడుతున్న సింపతీ డ్రామా అని, తప్పు చేశారు కాబట్టే బాబు అరెస్ట్ అయ్యారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

మరి ఇక్కడ సింపతీ అనేది ఎంతవరకు వస్తుందనేది పెద్ద చర్చ. గతంలో జగన్ అరెస్ట్ అయినప్పుడు వైసీపీకి సింపతీ వచ్చింది. 2012 ఉపఎన్నికల్లో ప్లస్ అయింది. కానీ అసలు ఎన్నికలకు వచ్చేసరికి 2014లో ఎలాంటి సింపతీ పనిచేయలేదు. అంటే ఇక్కడ సింపతీ అనేది తాత్కాలికమే. జైలుకు వెళ్ళిన కొన్ని రోజులు సింపతీ ఉండే ఛాన్స్ ఉంది.

కానీ ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉంది. అంతవరకు ఈ సింపతీ వర్కౌట్ అవ్వదు. ఇలా సింపతీ కోసం కాకుండా పార్టీని నిలబెట్టుకోవడం కోసం టి‌డి‌పి నేతలు పోరాడితే బెటర్.