చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం ఇదేనా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఉన్న సమయంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులలో రూ.347 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి.. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో గత కొన్నాలుగా ఈ కోణం విచారణ జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చంద్రబాబుని అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలోని CID కోర్టులో హాజరు పరిచారు.

Chandrababu Naidu, Balakrishna, & Jr NTR Coming Together!

దీంతో విజయవాడ సిబిఐ న్యాయస్థానం చంద్రబాబు నాయుడు ను 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు జైల్లో వేయడం జరిగింది.7691 అనే ఖైదీ నెంబర్ ని కూడా ఇవ్వడం జరిగింది. దీంతో కొంతమంది టీడీపీ నాయకులు సైతం రోడ్డు మీదకు వెళ్లి నిరసనలు తెలియజేయడం జరిగింది.. నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చంద్రబాబుకి సపోర్టుగా మాట్లాడారు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించకపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

ఎన్టీఆర్ స్పందించకపోవడానికి గల కారణం ఉందంటూ పలువురు విశ్లేషకులు సైతం తమ అభిప్రాయంగా తెలియజేశారు.. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు.. కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ స్పందించిన తీరు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలని వివాదాలకు దారి తీసేలా చేస్తున్నారు.. అందువల్లే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో స్పందించే అవకాశాలు లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బాలీవుడ్ లో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉండబోతున్నారు ఎన్టీఆర్. మరి రాబోయే రోజుల్లోనైనా ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టు పైన స్పందిస్తారేమో చూడాలి మరి.