ఎన్టీఆర్‌పై పడిన తమ్ముళ్ళు..ఇదేం ట్విస్ట్.!

రాష్ట్రంలో ఏం జరిగిన..ఎలాంటి పరిస్తితుల్లోనైనా తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఎన్టీఆర్‌ని స్పందించాలని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. అసలు ఆయన రాజకీయాల్లో లేరు..సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన స్పందించాలని అడుగుతుంటారు. అయితే భువనేశ్వరిని అవమానించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నప్పుడు ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్సార్ అని పేరు పెట్టినప్పుడు న్యూట్రల్ గా స్పందించారు.

అయితే ఇప్పుడు బాబు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించాలని తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది రాజకీయ పరమైన అంశం.. ఆ కేసులో ఏం జరిగిందో ఎన్టీఆర్‌కు తెలియదు. నిజనిజాలు ఏంటో తెలియదు. అలాంటప్పుడు ఎన్టీఆర్ గుడ్డిగా స్పందించడం జరిగే పని కాదు. బాలయ్య అంటే రాజకీయాల్లో కూడా ఉన్నారు. టి‌డి‌పి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఆయన స్పందించడం, బాబు కోసం నిలబడటం కామన్. అవన్నీ వదిలేసి తమ్ముళ్ళు ఎన్టీఆర్ స్పందించాలని ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి సందర్భాల్లో తమ కోసం నిలబడ్డ పవన్‌కు ధన్యవాదాలు చెబుతూ..పవన్‌ని ఎన్టీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ కేసులో ఏంటో, ఆ వ్యవహారం ఏంటో ఎన్టీఆర్‌కు ఏమి క్లారిటీ లేనప్పుడు ఏమని స్పందిస్తారని, ఎన్టీఆర్‌ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఒకవేళ ఎన్టీఆర్ స్పందించాలంటే..పార్టీని ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్ళకు సౌండ్ ఉండటం లేదు. మొత్తానికి బాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ స్పందించే అవకాశాలు ఏ మాత్రం లేవు.