ఉపాసన ధరించిన ఈ సింపుల్ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ఈ జంట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక జూన్ 24న ఈ జంట అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక మళ్ళీ ఏదవిధిగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఓ పక్కనే షూటింగ్లో టైం టు టైం పాల్గుంటూనే.. ఫ్యామిలీతో కూడా టైం గడుపుతున్నాడు. ఇక ఉపాసన కూడా తన తాత చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న అపోలో ఆసుపత్రి బాధ్యతలను చూసుకుంటుంది.

ఓవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరో పక్క తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా ఎప్పటికప్పుడు సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇక తాజాగా ఉపాసన తన కూతురుకు జన్మనిచ్చిన తర్వాత మొదటిసారిగా రామ్ చరణ్ తో కలిసి బయటకు వెళ్ళింది. ఉపాసన భర్త చరణ్ తో కలిసి ఓ పెళ్లి వేడుక నిమిత్తం ఫారిన్ కు వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆమె చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది. లైట్ పింక్ డ్రెస్ లో ఎంబ్రాయిడరీ జాకెట్ లో కూల్ స్టైలిష్ లుక్ లో ఉపాసన మెరిసింది. అయితే ఆమె ధరించిన డ్రస్ చూడడానికి సింపుల్ గా ఉన్నప్పటికీ ధర మాత్రం మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంది. ఆ వీడియోలో ఉపాసన వేసుకున్న డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.47 వేలు అట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.