బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ జవాన్. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.520.79 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందని మూవీ మేకర్ తెలియజేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్రలో నయనతార నటించింది. విజయ్ సేతుపతి, దీపిక పదుకొనే కీలకపాత్రలో నటించి మెప్పించారు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ జవాన్ వెనుక ప్రొడక్షన్ హౌస్ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ గణాంకాలను ఎక్స్ లో షేర్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో జవాన్ రూ.520.79 కోట్ల గ్రామసులను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసింది. వారాంతపు వసూలు ఎన్నడూ లేని విధంగా భారీ వసూళ్లను సాధించి కొత్త రికార్డును సృష్టించాయని ఈ పోస్టులో పేర్కొన్నారు మూవీ టీమ్. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద హై ఆక్టన్ యాక్షన్ త్రిల్లర్.
మొదటి రోజు రూ.129.6 కోట్లు వసూలు చేయగా ఇది ప్రపంచవ్యాప్తంగా హిందీ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ . మేకర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం రెండో రోజు రూ.110.87 కోట్లు మూడో రోజు రూ.144.20 కోట్లు నాలుగో రోజు రూ.136.1 కోటి రూపాయలను కలెక్ట్ చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగ భారీ సక్సెస్ అందుకోవడంతో షారుక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.