నెక్స్ట్ లోకేష్..రెడీ అయినట్లే.?

స్కిల్ డెవలప్మెంట్ కేసు లో టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని జగన్ ప్రభుత్వం ఇరికించిందని టి‌డి‌పి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. కానీ బాబు అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. అదే సమయంలో తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని, కోర్టు రిమాండ్ విధించిందని, లేదంటే రిమాండ్ విధించేది కాదని వైసీపీ వాళ్ళు అంటున్నారు.

ఇక ఈ విషయంలో ఎవరి వర్షన్ వారికి ఉంది. టి‌డి‌పి‌, వైసీపీ శ్రేణులు కాకుండా ఇంకా మిగతా న్యూట్రల్ గా ఉన్న వారు ఎలా ఆలోచిస్తారో ఎవరికి తెలియట్లేదు. ఈ విషయం పక్కన పెడితే. ఇక్కడ బాబు అరెస్ట్ తో టి‌డి‌పిలో సంక్షోభం మొదలైందనే చెప్పవచ్చు. ఎందుకంటే అసలు నేత జైలుకు వెళితే పార్టీలో నేతలకు, కార్యకర్తలకు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇప్పుడు దాదాపు అదే జరుగుతుంది. కాకపోతే ఓ వైపు లోకేష్, మరోవైపు బాలయ్య పార్టీ కోసం నిలబడ్డారు. ఈ నేపథ్యంలో టి‌డి‌పి శ్రేణులు కాస్త ధైర్యంగా ఉన్నాయి.

కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. ఈ కేసులో లోకేష్ పాత్ర కూడా ఉందని సి‌ఐ‌డి చెబుతుంది. దీంతో లోకేష్ అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం వస్తుంది. పైగా లోకేష్ కూడా తన అరెస్ట్ కూడా జరుగుతుందని టి‌డి‌పి నేతలతో చెబుతున్నారట.

దీని బట్టి చూస్తే లోకేష్ అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా లోకేష్ కూడా అరెస్ట్ అయితే సీన్ మారిపోతుంది. టి‌డి‌పి పూర్తిగా దెబ్బతింటుంది. బాబుకు త్వరగా బెయిల్ వస్తే పర్లేదు. అలా కాకుండా నాలుగైదు నెలలు పడితే..ఇంకా టి‌డి‌పి చాలా దెబ్బతింటుంది. ఎన్నికల ముందు ఈ అంశాలు పార్టీకి పూర్తి డ్యామేజ్ చేస్తాయి.