దీనస్థితిలో బిచ్చగత్తగా మారిన లేడీ కమెడియన్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒకప్పుడు స్టార్ పొజిషన్లో ఉన్న ఆర్టిస్టులు సైతం ప్రస్తుతం దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే అందుకు కారణం ఇండస్ట్రీలో ఉన్న దోపిడీ వ్యవస్థ అంటూ చాలామంది తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి యాక్టర్లలో నటి పాకీజా కూడా ఒకరు. ఈమె అసలు పేరు వాసుకి. ఈ తరం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే అయినా 1990లో లేడీ కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Pakija was seen by the media in a poor condition on the road Assembly Rowdy  Movie

అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్ర అప్పట్లో ఒక ట్రెండీగా పేరు తీసుకువచ్చింది. దీంతో ఆమె పేరే పాకీజాగా మారిపోయింది.తమిళంలో ఎక్కువ సినిమాలలో నటించిన ఈమె దాదాపుగా 250 కి పైగా చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె పరిస్థితి ఏమిటంటే తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం. వైద్యానికి డబ్బులు లేక ఒక యూట్యూబర్ ఆమె దీనస్థితిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆమెకు టాలీవుడ్ నుంచి కొంత సహాయం కూడా అందించినట్లు సమాచారం.

అయితే తన సొంత పరిశ్రమ కోలీవుడ్ మాత్రం అసలు ఆమెను పట్టించుకోలేకపోతోంది. మంచు విష్ణు ఆమెకు మా కార్డు కూడా ఇప్పించారు.. అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఆర్థిక సహాయం చేసినట్లు వార్తలు వినిపించాయి ఈమె పరిస్థితి అయినప్పటికీ బాగా లేకపోవడంతో ఏకంగా భిక్షటన చేస్తూ తిరుపతిలో కనిపించినట్లు సమాచారం. అక్కడ దుకాణాల ముందు ఆమె బిక్షటన చేస్తూ ఉండగా కొంతమంది గుర్తించారు. అలా మళ్లీ ఈమె వెలుగులోకి రావడం జరిగింది.. గత కొన్నేళ్లుగా హైదరాబాదులో ఉన్న పాకీజా ఇంటి అద్దె కూడా కట్టలేకపోవడంతో అక్కడి నుంచి వచ్చేసినట్లు సమాచారం.