బీజేపీకి పవన్‌ క్లారిటీ..తేల్చుకోవాల్సిందే.!

చంద్రబాబుకు బి‌జే‌పి మద్ధతు ఉందా? అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. బి‌జే‌పి సపోర్ట్ కోసం బాబు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చూశారు. అయితే బి‌జే‌పి ఎక్కడ కూడా బాబుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇటు బి‌జే‌పితో పొత్తులో ఉన్న పవన్ ద్వారా కూడా పొత్తు కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో బి‌జే‌పి మద్ధతు లేకపోవడంతోనే బాబు జైలు పాలయ్యారనే చర్చ నడుస్తోంది. అయితే బాబు అరెస్ట్‌ని బి‌జే‌పి ఖండించడం లేదు గాని…అరెస్ట్ అయిన విధానాన్ని మాత్రం ఖండించింది. కానీ జనసేన అధినేత పవన్ మాత్రం..పూర్తిగా బాబుకు మద్ధతుగా నిలిచి అరెస్ట్‌ని ఖండించారు. అలాగే టి‌డి‌పి బంద్‌కు జనసేన తరుపున మద్ధతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్‌లో టి‌డి‌పి శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు కూడా పాల్గొన్నాయి. ఇలా టి‌డి‌పితో పవన్ కలిసి ముందుకెళుతున్నారు.

కానీ ఈ విషయంలో బి‌జే‌పి మాత్రం సైలెంట్ గా ఉంది. దీంతో అసలు సినిమా ఏంటో అర్ధమవుతుందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.  బాబుని  అరెస్ట్ చేసే విషయంలో వైసీపీకి బి‌జే‌పి మద్ధతు పలుకుతుందని ఆరోపిస్తున్నారు. అయితే ఇదే అంశంపై మీడియా..లోకేష్‌ని ప్రశ్నించగా, ఆ విషయం తనకు తెలియదని, బి‌జే‌పి వాళ్ళని అడగాలని అన్నారు. అంటే బాబు అరెస్ట్ వెనుక బి‌జే‌పి లేదని ఖచ్చితంగా చెప్పడం లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే..బి‌జే‌పి..వైసీపీకి పరోక్షంగా సహకరిస్తుందని అంటున్నారు.

ఇక ఇటు పవన్ బి‌జే‌పితో సంబంధం లేకుండా టి‌డి‌పికి మద్ధతు తెలుపుతున్నారు. దీంతో పవన్ టి‌డి‌పితో పొత్తు ఖాయమని తెలుస్తోంది. అటు బి‌జే‌పి ఇంకా పొత్తులోకి వచ్చే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. టి‌డి‌పి-జనసేన పొత్తు ఖాయమైనట్లే అని చెప్పవచ్చు.