వామ్మో: 6 నిమిషాల గంగమ్మ జాతర కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేశారా.. పుష్పా గాడి లెవలే వేరబ్బా..?!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎప్ప‌టి నుంచో ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్న మూవీ పుష్ప 2. ఇక ఇటీవల ఈ మూవీ టీజ‌ర్ రిలీజై అంచనాలకు తగ్గట్టుగానే ఫ్యాన్స్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. ఒక్క డైలాగ్ లేకపోయినా.. బన్నీ టీజర్ యూట్యూబ్‌ను షేక్‌ చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మిలియ‌న్ల కొద్ది వ్యూస్ రాబట్టి రికార్డులను సృష్టించిన ఈ టీజర్ లో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు హైలెట్గా నిలిచాయి. కాగా పుష్ప 2 టీజర్ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించినట్లు.. ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కేవలం టీజర్ లో కనిపించే జాతర సన్నివేశాల కోసమే సుకుమార్ హైదరాబాద్‌లో 30 రోజులకు పైగా షూటింగ్ నిర్వహించారట‌. ఈ షూటింగ్ అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరిగిందని తెలుస్తుంది.

Pushpa 2: Did the "Gangamma Jatara" Song Cost a Bomb? | Pushpa 2: Did the "Gangamma  Jatara" Song Cost a Bomb?

ఇక అది మూవీలో కీలకమైన సన్నివేశం కాబట్టి.. వందలాదిమంది ఆర్టిస్టులు ఈ సినిమాలో భాగమయ్యారట. అలాగే ప్రత్యేక మేకప్, లైటింగ్ సెట్స్, భారీసెట్‌ ఇలా ప్రతిదానికి భారీగా నిర్మాతలు ఖ‌ర్చు చేశారని తెలుస్తుంది. ఈ సీన్ కి ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు ముంబై నుంచి ఓ అరుదైన కెమెరాను తెప్పించారని.. దీని షూటింగ్ కోసం దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం. స్టార్ నటినట్లు రెమ్యూనరేషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ మిగతావన్నీ కలుపుకుంటే మరో రూ.20 కోట్ల వరకు బ‌డ్జెట్ అయ్యింద‌ట‌. ఇక ఈ గంగమ్మ జాతర పాట సీన్లు 6 నిమిషాల పాటు కంటిన్యూగా జరుగుతుంది.

Pushpa The Rule teaser: Gangamma Allu Arjun gives goosebumps - Telugu News  - IndiaGlitz.com

ఇది మూవీకి ఓ హైలెట్ అని మేకర్స్ చెప్తున్నారు. ఒక్క ఆరు నిమిషాల సన్నివేశానికి రూ.60 కోట్ల వరకు ఖర్చయిందట. డిసెంబర్ 2021లో రిలీజ్ అయిన పుష్ప భారీ స‌క్స‌స్‌ సాధించడంతో ఇప్పుడు దానికి సీక్వెన్స్ గా వస్తున్న పుష్ప 2కి మొదటి నుంచే భారీ ఓపెనింగ్ జరుగుతున్నాయి. వీటికోసం మూవీ టీం కూడా తీవ్రంగా శ్రమిస్తుందని తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తెరకెక్కుతుంది. సినిమా మొత్తం బడ్జెట్ రూ.250 కోట్లు కాగా.. కేవలం ఆ ఒక్క గంగమ్మ జాతర సాంగ్ కోసమే రూ.60 కోట్లు ఖర్చు పెట్టారని తెలియడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో పుష్ప గాడి లేవలే వేరు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇక ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.